Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

అభ్యర్థుల అయోమయం

. ఇన్‌చార్జి అయినా టికెట్‌పై హామీ ఏదీ?
. వైసీపీ నేతల్లో కలవరం
. మంగళగిరి సీటు మొదటికి…!
. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో గందరగోళం
. గన్నవరం సీటు వంశీకి దక్కేనా ?
. ఆచితూచి అడుగేస్తున్న అధిష్ఠానం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: అధికార వైసీపీలో అభ్యర్థుల ఎంపిక అయోమయంగా మారింది. ఇటీవల విడతలవారీగా నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను ప్రకటిస్తూ వస్తున్న అధిష్ఠానం…అంతే స్థాయిలో మార్పులు చేర్పులు చేస్తోంది. టికెట్‌ దక్కని వారు అసంతృప్తికి గురవుతుండగా… ఇన్‌ఛార్జిలుగా నియమితులై అమ్మయ్యా… టికెట్‌ ఖాయమైందనుకున్న వారు కూడా సంతోషంగా లేరు. అధిష్ఠానం ఏ క్షణాన తమ సీటుకు ఎసరుపెడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా మంగళగరి వైసీపీ సీటు వ్యవహారం మొదటికొచ్చింది. వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తొలగించి, ఆయన స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి ఆధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి నియోజకవర్గ కేంద్రంగా చిరంజీవి పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. తాజాగా మళ్లీ ఆయనను తప్పించి, మహిళా బీసీ నేతకు అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. దీంతో గంజి చిరంజీవికి సీటు గ్యారెంటీ అని అంతా భావించారు. ఇదే సమయంలో వారం రోజుల్లో మంగళగిరి సీటు ఎవ్వరికి ఇస్తామనేదీ అధికారికంగా ప్రకటన వస్తుందంటూ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతల్లో గందరగోళం నెలకొంది.చిరంజీవి అనుచరులు అయోమయానికి గురవుతున్నారు. మంగళగిరికి చెందిన ఎమ్మెల్సీ మాడుగుల హనుమంతరావు కోడలిని బరిలోకి దించుతారని తెలిసింది. రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పోటీకి దిగడంతో, ఆయనకు దీటుగా అభ్యర్థిని నిలపాలని ఆధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని విధాలా సర్వేలను నిర్వహించి, అక్కడ అభ్యర్థిని ప్రకటించేందుకు వైసీపీ సిద్ధమైంది. కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే సీటుపైనా ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు టికెట్‌ వస్తుందా? లేదా? అనేదీ ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఆయన సీఎం జగన్‌ను కలవడంతో టికెట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి ఆయన టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం వైసీపీలోకి వచ్చి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నారు. దీంతో వంశీని గన్నవరం వైసీపీ ఇన్‌ఛార్జిగా ఆధిష్ఠానం ప్రకటించింది. మారుతున్న సమీకరణల ఆధారంగా గన్నవరం బీసీకి ఇవ్వాలని వైసీపీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో వంశీని పక్కనే ఉన్న పెనమలూరు లేదా మైలవరానికి పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అప్పటివరకు గన్నవరం వైసీపీ అభ్యర్థి ఎవనేది ప్రశ్నార్థకంగా మారింది. వంశీ అనుచరులు మాత్రం గన్నవరం నుంచే పోటీ చేయాలని, వైసీపీ నుంచి టికెట్‌ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సూచిస్తున్నారు.
కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి బుజ్జగింపులు
రాబోయే ఎన్నికల్లో టికెట్‌ దక్కని కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి వైసీపీ నేతలు బుజ్జగింపులు ప్రారంభించారు. సిద్ధారెడ్డి ఇంటికి శుక్రవారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లి… ఆయనను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల వైసీపీలో టికెట్లు దక్కని వారంతా పార్టీని వీడుతున్నారు. వారి బాటలోనే సిద్ధారెడ్డి ఉన్నారన్న సమాచారంతో ఆయనను వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్‌ కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. దీంతో సిద్ధారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదీ ఉత్కంఠగా మారింది. ఈనెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది. ఆలోగానే వైసీపీ ఏడో జాబితాను వెల్లడిస్తారని తెలిసింది. ఎంపీలతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థులుంటారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీని వీడుతున్నారన్న ప్రచారంతో, ఆయనతో వైసీపీ ముఖ్యనేతలు చర్చిస్తున్నారు. మరోవైపు వేమిరెడ్డి పార్టీని వీడితే, ఆయనకు దీటుగా మరొకర్ని నిలపడంపై ఆధిష్ఠానం దృష్టిపెట్టింది. మాజీ ఎంపీ మేకపాటి కుటుంబ సభ్యుల నుంచి గానీ, మరో పారిశ్రామిక వేత్తను గానీ రంగంలోకి దించాలని చూస్తోంది. వైసీపీ ఆరు విడతలుగా ఎంపీ, ఎమ్మెల్యే ఇన్‌ఛార్జి అభ్యర్థులను మార్పులు, చేర్పులు చేసినప్పటికీ, ఎన్నికల నామినేషన్‌ నాటికి వారందరికీ టికెట్లు వస్తాయా? లేదా? అనేదీ అంతుచిక్కడం లేదు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి పోటీచేస్తారనుకుంటున్న వారి కంటే బలహీనమైన వారిని ఇన్‌ఛార్జిలుగా ప్రకటించింది. వారందర్నీ అలాగే కొనసాగిస్తారా? లేక మారుస్తారా? అనేదీ అభ్యర్థులకూ అంతుచిక్కడం లేదు. ఇటీవల కొంత మందిని తిరిగి యథాతథంగా ఇన్‌ఛార్జిలుగా కొనసాగిస్తూ వైసీపీ ఆధిష్ఠానం నిర్ణయించింది. ఇన్‌ఛార్జిలుగా ఉన్న వారిలో కొందర్ని ఎన్నికల నాటికి అప్పటి సర్వేల ఆధారంగా మళ్లీ మార్పులు, చేర్పులు చేస్తారని తెలిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img