Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Saturday, September 28, 2024
Saturday, September 28, 2024

కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న అధికారులు ప్రతి నెల జీతాలు ఎందుకు ఇప్పించడం లేదు

ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : ప్రభుత్వ ఆసుపత్రిల్లో, వైద్య కళాశాలలో పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ మొదలైన కాంట్రాక్టు వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న హాస్పిటల్స్ సూపరింటెండెంట్, ప్రిన్సిపల్, డిసిహెచేఎస్ లు కాంట్రాక్టర్లు చేత పెరిగిన జీతాలు, పిఎఫ్ డబ్బులు, ఈ.ఎస్.ఐ కార్డులు ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మండిపడ్డారు.సోమవారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఎఐటియుసి అనుబంధం ) ఆధ్వర్యంలో ఎఐటియుసి ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేపట్టి జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ హాస్పిటల్స్ లో ఉన్న పేషేంట్లకి ఇబ్బంది కలగకుండా, ప్రాణాలు లెక్కచేయకుండా పనులు చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు జీవితాలను జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్ దళారీ వ్యవస్థ చేతుల్లో పెట్టేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వనప్పుడల్లా రోడ్డెక్కి ధర్నాలు చేస్తేనే జీతాలు వేస్తారు లేకుంటే వారిని పండుగల్లో కూడా పస్థులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వ సర్వజన, ఘోష, వైద్య కళాశాల, పి.హెచ్.సి, సి.హెచ్.సి, ఏరియా ఆసుపత్రలల్లో పనిచేశ్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య, పెస్ట్ కంట్రోల్ వర్కర్లకు, సూపర్వైజర్లుకి ప్రభుత్వం జారీ చేసిన 549 జీవో ప్రకారం కాంట్రాక్ట్ వర్కర్స్ కి 16000, సెక్యూరిటీ గార్డులకి జి.ఓ నెం. 43 ప్రకారం 12,688/- జీతాలు ప్రకటించిన ప్రభుత్వం వర్కర్స్ జీతభత్యాల విషయం తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాకు చెందిన టి.వి.టి గ్రూప్స్ అనే కాంట్రాక్టురుకి, భీమవరంలో ఉన్న స్కాట్ ల్యాండ్ గ్రూప్ కాంట్రాక్టరుకి గత ప్రభుత్వం అప్పగించి కమిషన్లకి ఆశపడి దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం వలనే వైసిపి కి కార్మికులు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇలా దళారీ చేతుల్లో పెట్టడం వలన పెరిగిన వేతనాలు ఇవ్వకుండా, ప్రతి నెలా సక్రమంగా జీతాలు చెల్లించకుండా వర్కర్స్ బ్రతుకులతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. శ్రమకి తగిన జీతం లేక, ప్రతి నెల జీతాలు అందకపోవడం వలన ధరల భారాలను తట్టుకోలేక అప్పులపాలు అయ్యి వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టరు మారిన తర్వాత సుమారు 36 మాసాలు నుంచి పి ఎఫ్ ఎంత జమ అవుతుందో, ఈఎస్ఐ ఎంత కటింగ్ చేస్తున్నారో ఇంతవరకు ఫే స్లిప్పులు ధ్వారా తెలియజేయకుండా నాటకాలాడుతూ తక్కువ వేతనాలు చూపిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. హాస్పిటల్స్ వార్డులు పెరగిడం వలన ఆసుపత్రిలో సరిపడా వర్కర్స్ నియమించకుండా తక్కువ మంది వర్కర్స్ తో వెట్టిచాకిరీ చేయించుకుని ప్రభుత్వం జారీ చేసిన జీవో 549 ప్రకారం జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టరు కార్మికులందర్నీ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా సీజన్లో కూడా ఇల్లు, పిల్లల్ని వదిలి ప్రాణాలు పణంగా పెట్టి, కరోనా రోగులకు సేవ చేసి వర్కర్స్ అందరూ కరోనా బారిన పడిన వారిని కనీసం గత ప్రభుత్వం లో ఎవ్వరూ పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి కూటమి ప్రభుత్వ పాలకులు వెంటనే కలుగజేసుకొని ప్రభుత్వ ఆసుపత్రిల్లో, వైద్య కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ అందరిని అప్కాశ్ లో చేర్చి ప్రతి నెలా జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రిల్లో, వైద్య కళాశాల పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ వర్కర్స్, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img