Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వైద్యులకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలి….

– వైద్య విద్యార్థిని పై హత్యాచారాన్ని ఖండిస్తూ ఆందోళనకు దిగిన చోడవరం సి.హెచ్.సి. వైద్యులు, సిబ్బంది…

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.17.08.2024ది. వైద్యలకు ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలి అని అనకాపల్లి జిల్లా చోడవరం సామాజిక ఆరోగ్య కేంద్రం (కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సి.హెచ్.సి), గవరవరం పి.హెచ్.సి. వైద్యులు, సిబ్బంది శనివారం ఆందోళనకు దిగారు. కలకత్తా ఆర్.కె.జి. వైద్య కళాశాల లో వైద్య విద్యార్థినిని అత్యాచారం చేసి, చంపేసిన ఘటనను ఖండిస్తూ, వైద్యలు పై దాడులు, హత్యాచారాలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ, కొత్తూరు జంక్షన్ లో మానవహారం ఏర్పడి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.సి. సూపర్నెంట్, వైద్యలు ఎల్.వినయ్ కుమార్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళా వైద్యలు, సిబ్బంది కి ప్రభుత్వమే పూర్తి రక్షణ కల్పించాలి అన్నారు. వైద్య కళాశాల లో వైద్య విద్యార్థిని పై హత్యాచారాన్ని అన్ని మహిళా, ప్రజా సంఘాలు ఖండించాలని, బాద్యులు ఎంతటి వారైనా చట్ట పరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కేసులో దాడికి పాల్పడిన వారిని బహిరంగా కఠినంగా శిక్షించి, మహిళలపై ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హత్యాచారంలో ప్రాణాలు కోల్పోయిన వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం సి.హెచ్.సి. వైద్యులు మల్లిఖార్జున, హిమబిందు, దినేష్, రేష్మ, శ్రీనివాస్, గవరవరం పి.హెచ్.సి (ప్రాధమిక ఆరోగ్య కేంద్రం) వైద్యులు ప్రదీప్, భారతి, సత్యదీపిక, సబ్ యూనిట్ అధికారి ఎం.వెంకటరమణ, ఎం.పి.హెచ్.ఈ.ఓ. రవి కుమార్, హెల్త్ ఎడ్యూకేటర్ సింహాచలం, ఏ.ఎన్ ఎం.లు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img