Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 22, 2024
Sunday, September 22, 2024

విశాఖ రైల్వేజోన్‌కు పచ్చజెండా !

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విశాఖ రైల్వేజోన్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనిపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టత ఇచ్చారు. త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిరచారు. గత ప్రభుత్వ హయాంలో భూములపై అభ్యంతరాలు తలెత్తిన నేపథ్యంలో విశాఖ రైల్వేజోన్‌కు ఆటంకం ఏర్పడిరదన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు సమన్వయంతో పనిచేస్తున్నా యని, అధికారుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగినట్లు చెప్పారు. దీంతో జోన్‌ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపో తాయని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖ రైల్వేజోన్‌ అంశంపై గత వైసీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ వివాదం నెలకొంది. భూములు తాము కేటాయి స్తామని చెప్పగా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 53వేల ఎకరాల భూ కేటాయింపులు జరగకపోవ డంతోనే రైల్వేజోన్‌ ఆగిపోయిందని కేంద్రం వ్యాఖ్యా నించింది. దీనిపై అప్పట్లో రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు, రాష్ట్ర మంత్రులకు మధ్య వాదోపవాదనలు కొనసాగాయి. దానిపై విశాఖ భూ కేటాయింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని అప్పటి కలెక్టర్‌ వివరణిచ్చారు. రైల్వేజోన్‌ కోసం 53వేల ఎకరాలను డీమార్క్‌ చేశామని, దానిపై కేంద్రానికి లేఖ రాసినా కేంద్రం నుంచి స్పందన రాలేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర, రాష్ట్రాలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు కలిసి పెండిరగ్‌ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులూ విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించారు. దీంతో విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img