Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రభుత్వ భూముల్లో భూకబ్జా పట్టాల ముసుగులో నాయకుల భూ దందా

హెచ్చరిక బోర్డు లేని ప్రభుత్వ భూములు
చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ

విశాలాంధ్ర- పామిడి (అనంతపురం జిల్లా) : ప్రభుత్వ భూముల్లో భూకబ్జా తెర లేపుతూ పట్టాల ముసుగులో నాయకులు భూ దందా విచ్చలవిడిగా నిర్వహిస్తున్నప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులను చూస్తూ ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.వివరాలు…. పామిడి మండల పరిధి పి .కొండాపురం రోడ్డు పామిడి రెవెన్యూ పొలంలోని 1 సర్వే నంబర్లో దాదాపు కొన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పామిడి తాహసిల్దార్ కార్యాలయం కేవలం ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్రస్తుతం ఇక్కడ ఎకరా రూ.1 కోట్ల దాకా విలువచేస్తోంది. గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న 2019లో కొంతమంది వైయస్సార్ నాయకులు ఈ భూమిని ఆక్రమించాలని గుడిసెలు వేయడం జరిగిందన్నారు.రెవెన్యూ, పోలీసులు అధికారులు అడ్డుకోవడంతోపాటు గుడిసెలను జెసిపిలతో 2023 జూన్ లో గుడిసెలు తొలగించడం జరిగిందని ప్రజలు తెలియజేశారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. అప్పటి నుంచి కొన్ని రోజులు భూమిలోకి ఎవరూ వెళ్లే సాహసం చేయలేకపోయారన్నారు
ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఎలాగైనా ఆ భూమిని ఆక్రమించుకోవాలని కొంత మంది నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారని ప్రజలనుకుంటున్నారు. రాజకీయ అధికార పార్టీ నాయకులతో కలిసి భూ కబ్జాదారులు భూదండా కు తెర లేపారన్నారు. కనీసం ప్రభుత్వ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో సదరు భూ కబ్జాదారులు తిరిగి భూ దందాను తిరిగి మొదలుపెట్టారని ప్రజలు వాపోతున్నారు. పి.కొండాపురం ప్రాంతానికి చెందిన ఓ నాయకుడు, చోటామోటా నాయకులు ముగ్గురు కలసి దందా తమదైన శైలిలో పేద ప్రజల నుంచి పట్టాలిప్పిస్తామంటూ దాదాపు రూ. 2, 000 పైగా వసూల్ చేస్తున్నట్టు ప్రజలు వాపోతున్నారు.

పట్టని అధికారులు……

తాహసిల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు మిన్నకుండిపోతున్నారు. చర్యలు తీసు కోకుండా చేష్టలుడిగి చూస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ భూములతో వ్యాపారం చేస్తున్న వారి ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.చర్యలు తప్పవు….

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు. పామిడి రెవెన్యూ సర్వే నంబర్ 1లోని భూమి కొండకు సంబంధించింది. ఆదేశాల మేరకు విచారణ చేపట్టి భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
గుంతకల్ రెవిన్యూ డివిజన్ ఆఫీసర్…..
శ్రీనివాసులు రెడ్డి…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img