Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 23, 2024
Monday, September 23, 2024

శ్రీలంక ప్రధాని పదవికి దినేష్ గుణవర్దన రాజీనామా

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనురా కుమార దిసానాయకే గెలుపొందిన అనంతరం అధికార మార్పిడిలో భాగంగా శ్రీలంక ప్రధానమంత్రి దినేష్ గుణవర్దన సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు రాసిన లేఖలో, గుణవర్దన తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. జాతీయ పార్లమెంటును రద్దు చేశారు. దిసానాయకే ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే రాజీనామా చేయడం జరిగింది. మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయి, దశాబ్దాల తరబడి అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం కారణంగా విస్తృతంగా చెలరేగిన నిరసనల నేపథ్యంలో రాజీనామా చేసిన తర్వాత 75 ఏళ్ల గుణవర్ధన జూలై 2022లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత మార్క్సిస్ట్ నాయకుడు అనుర కుమార దిసానాయకే శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున పార్టీ యొక్క బ్రాడర్ ఫ్రంట్ నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పిపి) నాయకుడు, 56 ఏళ్ల దిసానాయకే, తన సమీప ప్రత్యర్థి సమిత్ జన బలవేగయ (ఎస్‌జెబి)కి చెందిన సజిత్ ప్రేమదాసను ఓడించారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఓట్ల జాబితాలో మొదటి రెండు స్థానాల్లోకి రాకపోవడంతో తొలి రౌండ్‌లోనే ఎలిమినేట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img