విశాలాంధ్ర -అనంతపురం : ఈ ఏడాది మార్చిలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి కార్పస్ ఫండ్ కింద రూ. 1 లక్ష విలువ చేసే చెక్కును జిల్లా ఎస్పీ గౌతమిసాలి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి అందజేశారు. జిల్లాలో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సుంకన్న ( హెచ్ సి,పీసీ 1279 ) ఈ ఏడాది మార్చి నెలలో మృతి చెందాడు. కార్పస్ ఫండ్ కింద రూ. 1 లక్ష విలువ చేసే చెక్కును మృతుడి భార్య నాగలక్ష్మికి అదనపు ఎస్పీ ఈరోజు అందించారు. ఈ కార్యక్రమంలో బి సూపరింటెండెంట్ ప్రసాద్ పాల్గొన్నారు.