Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఆర్‌-5 జోన్‌పై తీర్పు రిజర్వు

హైకోర్టులో ముగిసిన విచారణ
విశాలాంధ్ర బ్యూరో –అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్‌5 జోన్‌ వ్యవహారంపై హైకోర్టులో శుక్రవారం విచారణ ముగిసింది. రెండుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. సీఆర్‌డీఏ చట్టంలో 5 శాతం భూమి పేదలకు కేటాయించవచ్చని స్పష్టంగా ఉందని, ఆ మేరకు పేదలకు సెంటు భూమి కేటాయించి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిం చారు. ఆర్‌`5 జోన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసిన జీవో 45ను హైకోర్టుకానీ, సుప్రీంకోర్టు కానీ స్టే ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై రైతుల తరపు న్యాయ వాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ ఒప్పం దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని, నాలుగేళ్లుగా రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయలేదని తెలిపారు. రాజధాని నిర్మాణ పనులనే నిలిపివేశారని, కోర్టు తీర్పులను సైతం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అమరావతి రాజధానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించడం న్యాయవిరుద్ధమని తెలిపారు. ఇద్దరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.
రైతులకు కౌలు మంజూరు
అమరావతి రైతులకు కౌలు మంజూరు చేస్తున్నట్లు సీఆర్‌డీఏ ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రైతులకు కౌలు చెల్లించేందుకు రూ.240 కోట్లు విడుదల చేసింది. ఇటీవల రాజధాని రైతులు సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఈ మేరకు సీఆర్‌డీఏ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పేరిట శుక్రవారం ప్రకటన విడుదలైంది. 24,521 మంది రైతులకు 28,491 ఎకరాలకు రూ.185 కోట్లు విడుదల కోసం ప్రతిపాదనలు రాగా… నేటి వరకూ 23,398 ఎకరాలకు రూ.175 కోట్లు మంజూరు చేసేందుకు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ అయినట్లు తెలిపారు. అసైన్డ్‌ భూములకు సంబంధించి సీఐడీ విచారణలో 1751 ఎకరాల భూమి లెక్క ఇంకా తేలలేదు. సంబంధిత రైతులు ఒరిజినల్‌, సర్టిఫైడ్‌ కాపీలు ఫైల్స్‌లో లేకపోవడంతో అసైన్‌మెంట్‌ వివరాలు ధృవీకరించేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్‌కు సీఆర్‌డీఏ అధికారులు పంపించినట్లు చెప్పారు. కలెక్టర్‌ నుంచి ధృవీకరణ వచ్చిన వెంటనే అర్హులైన అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని సీఆర్‌డీఏ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పేరిట విడుదలైన ప్రకటనలో వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img