Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 22, 2024
Sunday, September 22, 2024

ఏపీకి అంబేద్కర్‌ వర్సిటీ దూరం!

. 2024`25లో ప్రవేశాల నిలిపివేత
. తెలంగాణ విద్యార్థుల కోసమే నోటిఫికేషన్‌
. వర్సిటీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు
. ఆంధ్రా విద్యార్థులకు అన్యాయం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేరొందిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు నిలుపుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర విద్యార్థులకు, కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్‌గా మారింది. దీంతో హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం భవనం, ఆస్తులు, సేవలు, కార్యకలాపాలు తెలంగాణ రాష్ట్రానికే సొంతమా? అన్న ప్రశ్న ఉదయించింది. విశ్వవిద్యాలయం జారీజేసిన ప్రవేశ నోటిఫికేషన్‌లో ఒక్క తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకేనని స్పష్టంచేసింది. ఈ నిర్ణయంతో ఏపీకి చెందిన వేలాది మంది విద్యార్థులు అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు దూరమవుతున్నారు. గత విద్యా సంవత్సరాల్లో ప్రవేశాలు పొంది, డిగ్రీ, పీజీలలో ఉన్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఏపీలో ప్రత్యేకంగా మరో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన ప్రభావంతో రాష్ట్రానికి ఈ నష్టం వాటిల్లింది. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఆ సమయంలో విభజన అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. ఈ భేటీ తర్వాత కూడా అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ప్రవేశాలను రాష్ట్రానికి నిలిపివేయడంపై సర్వత్రా వ్యతిరేకత ఉంది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని రాష్ట్ర ఉన్నత విద్య శాఖాధికారులు కొద్దిరోజుల క్రితం కోరిన నేపథ్యంలో వర్సిటీ అధికారులు గతంలో ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేశారు. కూటమి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రాకపోవడంతో తాజాగా పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏపీ ప్రభుత్వం అభ్యర్థిస్తే నోటిఫికేషన్‌లో మార్పులు చేసి, చదువుకునేందుకు అవకాశం ఇస్తామని వర్సిటీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. కూటమి ప్రభుత్వం వేగవంతంగా నిర్ణయం తీసుకుంటేనే రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం లభిస్తుంది.
తెలంగాణతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపుల లోపమేనా ?
2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇస్తూ అంబేద్కర్‌ వర్సిటీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని అందులో సూచించింది. ఈ తరహా ప్రకటన ఈ విద్యా సంవత్సరమే రావడం చర్చానీయాంశమైంది. గత విద్యా సంవత్సరం మూడేళ్ల డిగ్రీ కోర్సులో దాదాపు 1.54 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇందులో 70 శాతం మంది తెలంగాణ, 30 శాతం మంది ఏపీకి చెందిన విద్యార్ధులు ఉండటం గమనార్హం. ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఏపీలో మొత్తం 76 స్టడీ సెంటర్లు నడుస్తున్నాయి. వాటి పర్యవేక్షణ కోసం ప్రాంతీయ కేంద్రాలనూ ఏర్పాటు చేశారు. గతేడాది విద్యా సంవత్సరం డిగ్రీ మొదటి సంవత్సరంలో దాదాపు 50వేల మంది ప్రవేశాలు పొందారు. ప్రతేటా రూ.16కోట్లకుపైగా ఏపీ నుంచి తెలంగాణలో అంబేద్కర్‌ విశ్వవిద్యాలయానికి ఆదాయం వస్తోంది. ఏపీ స్టడీ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి, ఫ్యాక్టలీలకు రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు అందిస్తోంది. దీనిపై న్యాయస్థానం పరిధిలో కేసులు ఉన్నప్ప టికీ, తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఏపీకి చెందిన విద్యావేత్తలు పేర్కొంటున్నారు. అటు విభజన పంపకాల కింద అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి ఏపీకి దాదాపు రూ.300 కోట్లు బకాయిలు చెల్లిం చాల్సి ఉందని, వాటిని రాబట్టేందుకు కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాలని కోరుతున్నారు.
‘మీ ఇంటి ముందుకే విద్య’ నినాదం… లక్షల మందికి డిగ్రీలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఏపీఓయూ)ను 1982 ఆగస్టు 26వ తేదీన శాసనసభలో ఆమోదించారు. అనంతరం దీనిని హైదరా బాద్‌ జూబ్లీహిల్స్‌లో నిర్మించారు. తదనంతరం 26 అక్టోబరు 1991న దీనికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం(డాక్టర్‌ బీఆర్‌ఏఓయూ)గా పేరు మార్చారు. మీ ఇంటి ముందుకే విద్య నినాదంతో ఎంతో మంది పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోగా, వారికి డిగ్రీలలో ప్రవేశాలు కల్పించింది. ఎలాంటి విద్యార్హత లేకపోయినప్పటికీ, అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి నేరుగా డిగ్రీలో ప్రవేశాలు కల్పించేవారు. యూజీసీ నిబంధనలననుసరించి ఇటీవల ప్రవేశాల్లో టెన్త్‌, ఇంటర్‌ అర్హతతోనే డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. యూజీ కోర్సులతోపాటు పీహెచ్‌డీ, పీజీ, పీజీ డిప్లొమో, డిప్లొమో, బీఈడీ, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ఏటా ఏపీ నుంచి లక్షలాది మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. విజయవంతంగా చదువు పూర్తి చేసి అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం యూజీసీ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (డెబ్‌) అనుమతులతోపాటు నాక్‌ ఏ`గ్రేడ్‌ సాధించింది. ఏపీలో ఆంధ్రా విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విద్య అందుబాటులో ఉన్నప్పటికీ, అధిక శాతం అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయాల ప్రవేశాలపైనే ఆసక్తిచూపుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పదేళ్లుగా ఏపీ విద్యార్థులు అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు పొందుతున్నారు. ఇప్పుడు ఉన్న పళంగా ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు నిలిపివేతపై విద్యార్థులు, అంబేద్కర్‌ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేపట్టి, ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించాలని కోరుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఏపీలో ప్రత్యేకంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img