Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఏయూ ఉపకులపతిగా ప్రసాదరెడ్డి అనర్హుడు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర`విజయవాడ:
ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా అత్యంత వివాదాస్పదుడు ప్రసాదరెడ్డిని రెండోసారి నియమించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రసాదరెడ్డిని ఉపకులపతి పదవి నుంచి తక్షణమే తొలగించాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఏపీలో ఐదు విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా వైసీపీ అనుకూలురులకే కట్టబెట్టడం విచారకరమని విమర్శించారు. ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా, అత్యంత వివాదాస్పదుడిగా పేరుగాంచిన ప్రసాదరెడ్డిని ప్రతిష్ఠాత్మక ఏయూ ఉపకులపతిగా రెండోసారి నియమించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని అతిక్రమించి ప్రసాదరెడ్డి అధ్యాపకులతో సమావేశాలు ఏర్పాటుచేసి… వైసీపీ అభ్యర్థికి ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారని గుర్తుచేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టినప్పటికీ ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అనేకసార్లు ప్రజాసంఘాలు, విద్యారంగ నిపుణులు, అధ్యాపకుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చినా వైసీపీ కార్యకర్తగానే ప్రసాదరెడ్డి వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్‌ జన్మదిన వేడుకలకు విశ్వవిద్యాలయాన్ని వేదిక చేయడం, యూనివర్సిటీ నిధుల దుర్వినియోగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను వేధింపులకు గురిచేయడం, రీ వాల్యుయేషన్‌ ప్రక్రియ ద్వారా సొంత కళాశాలలకు మేలు చేయడం, ఏపీ విశ్వవిద్యాలయ చట్టాన్ని తుంగలో తొక్కి తన సన్నిహితులను ప్రిన్సిపాళ్లుగా, రిజిస్ట్రార్లుగా కొనసాగించడం, యూనివర్సిటీలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వంటి వైసీపీ అనుకూల విధానాలు అవలంబించారని తెలిపారు. ప్రసాదరెడ్డి ఉపకులపతిగా ఉన్న కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పూర్వ విద్యార్థుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడాన్ని విస్మరించరాదన్నారు. విద్యాలయాలను రాజకీయాలకు, కుల, మతాలకు వేదికలుగా చేసే జగన్‌ కుట్రలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గవర్నర్‌ తక్షణమే జోక్యం చేసుకుని ప్రసాదరెడ్డిని తొలగించి, విశ్వవిద్యాలయాల్లో కుట్రపూరిత రాజకీయాలకు ఆస్కారమివ్వకుండా చూడాలని, ప్రసాదరెడ్డి అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img