Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

కేంద్రం ఎన్నికల వరాలు

. ప్రభుత్వోద్యోగులకు 4శాతం డీఏ పెంపు
. మరో ఏడాది ‘ఉజ్వల’ సబ్సిడీ పొడిగింపు
. ఈశాన్య పారిశ్రామికీకరణకు రూ.10,037 కోట్లు
. ఐదేళ్ల ‘ఏఐ’ మిషన్‌ కోసం రూ.10,372 కోట్లు

న్యూదిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రప్రభుత్వం అన్ని వర్గాలను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. పేదింటి మహిళల కోసం ఉజ్వల పథకం కింద ఎల్పీజీ సబ్సిడీని వచ్చే ఏడాదికి పొడిగించింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచింది. పారిశ్రామికీకరణకు ఊతమిచ్చేలా రూ.10,037 కోట్లు మంజూరు చేసింది. ఏఐ మిషన్‌ కోసం మరో రూ.10,372 కోట్లు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడిరచారు. జూట్‌పై ఎంఎస్పీని రూ.285 మేర పెంచినట్లు గురువారం సమావేశం అనంతరం విలేకరులతో గోయల్‌ అన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి నాలుగు శాతం డీఏ పెంపు అమలు కానున్నట్లు చెప్పారు. తద్వార కోటి మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఇప్పటివరకు 46శాతంగా ఉన్న డీఏ ఇకపై 50శాతం అవుతుందన్నారు. డీఏ, డీఆర్‌ కలిపి ఏటా రూ.12,869 అదనపు భారం ప్రభుత్వ ఖనాజాపై పడుతున్నట్లు వెల్లడిరచారు. 2024 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు రూ.15,014కోట్ల భారం ఉంటుందన్నారు. డీఏ పెంచడం ద్వారా రవాణా, క్యాంటీన్‌, డెప్యూటేషన్‌ తదితర అలవెన్సులలో 25శాతం వరకు పెరిగాయని, గ్రాట్యుటీ ప్రయోజం 24శాతం పెరిగిందని, ఖనానాపై వార్షికంగా రూ.9,400 కోట్ల భారం పడుతుందని తెలిపారు. అదే విధంగా ఏప్రిల్‌ ఒకటో తేదీతో ప్రారంభమయ్యే
ఆర్థిక సంవత్సరంలో ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఎల్పీజీ సిలిండర్లపై రూ.300 సబ్సిడీని పొడిగించాలని కేబినెట్‌ నిర్ణయించిందని గోయల్‌ తెలిపారు. దీంతో 10కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, ప్రభుత్వానికి రూ.12వేల కోట్ల వ్యయమవుతుందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల కోసం ‘ఉన్నతి’ పేరిట నూతన పారిశ్రామిక అభివృద్ధి పథకానికిగాను రూ.10,037 కోట్లు మంజూరు చేసిందని, ఉత్తర పూర్వ సంస్కరణాత్మక పారిశ్రామికీకరణ పథకం 2024ను కేంద్ర కేబినెట్‌ ఆమోదించిందని చెప్పారు. 202425లో రాజూట్‌ (టీడీఎన్‌`3)పై కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను రూ.285 మేర పెంచగా క్వింటా ధర రూ.5,335కు చేరిందని, దీంతో తూర్పు రాష్ట్రాలు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ రైతులకు లబ్ధి చేకూరుతుందని గోయల్‌ తెలిపారు. వ్యవసాయ వ్యయం, ధరల కమిషన్‌ (సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగా కేంద్ర కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. అలాగే ఇండియా ఏఐ మిషన్‌ కోసం రూ.10,375 కోట్లను కేంద్ర కేబినెట్‌ ఆమోదించినట్లు గోయల్‌ తెలిపారు. ఏఐ ఎకోసిస్టమ్‌ ఏర్పాటుకు 10వేల జీపీయూతో కూడిన సూపర్‌ కంప్యూటింగ్‌ సామర్థ్యం వివిధ భాగస్వాములకు అందనున్నట్లు చెప్పారు. స్టార్టప్‌లు, విద్యావేత్తలు, పరిశోధకులతో పాటు పరిశ్రమలకు ఈ మిషన్‌ కింద ఏఐ సూపర్‌ కంప్యూటింగ్‌ మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని గోయల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img