Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

జగన్‌ క్యాన్సర్‌ గడ్డ

. పేదలకు రూ.10 ఇచ్చి వెయ్యి దోచేయడం ఆయన నైజం
. గుడివాడ సభలో చంద్రబాబు ధ్వజం
. టీడీపీ`జనసేన గెలుపు ఖాయమని ధీమా

విశాలాంధ్ర`గుడివాడ : వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలతో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేసేదంతా పనికిమాలిన పనులని విమర్శించిన ఆయన… జగన్‌ ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ అని ధ్వజమెత్తారు. సినిమాల్లో విలన్‌ నాగభూషణం తరహాలో.. జగన్‌ తడి గుడ్డలతో గొంతుకోస్తాడని, బాబాయిని చంపేయడంతో పాటు తన చెల్లెలిపై కేసులు పెట్టించిన ఘనత జగన్‌ది అని ఆరోపించారు. గురువారం గుడివాడ రూరల్‌ మండలం మల్లాయిపాలేంలో జాతీయ రహదారి వెంబడి అలంకృత ఫంక్షన్‌ హాల్‌ ఎదురుగా టీడీపీ ఇన్‌చార్జి వెనిగండ్ల రాము అధ్వర్యంలో నిర్వహించిన రా…కదలిరా బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు… తొలుత నందమూరి తారకరామరావు 28వ వర్థంతి సందర్బంగా అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ… జగన్‌ తన ఇంటి ఆడబిడ్డకు ఆస్తిలో హక్కు కల్పించడం లేదని, ఆయనకున్న విశ్వసనీయత ఇదేనా? నిన్నటి వరకు జగనన్న బాణమైన ఆమె… ఇప్పుడేమైందని ప్రశ్నించారు. మద్యపానాన్ని నిషేధం చేస్తానంటూనే… మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టాడని జగన్‌పై చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. మద్య నిషేధం చేయకుంటే ఓట్లు అడగనని జగన్‌ అన్నారని, ఇప్పుడు అతనికి ఓట్లు అడిగే హక్కుందా? అని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ, జాబ్‌ క్యాలెండర్‌లు ఏమయ్యాయని ప్రశ్నించారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్‌ అని, రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నాడని విమర్శించారు. పన్నులు, ధరల పెంపు వల్ల ప్రతి పేద కుటుంబంపై నాలుగైదు లక్షల భారం వేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం.. పేదల రక్తం తాగే ప్రభుత్వమని నిప్పులు చెరిగారు. పోల వరం ఆగిపోయిందని, రాజధానిని కూడా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితికి జగన్‌ వచ్చారన్నారు. ఐదేళ్లల్లో జగన్‌ ఒక్క ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ కూడా పెట్టలేదన్నారు. మనమంతా పండుగకి పల్లెకు వెళ్తే… జగన్‌ మాత్రం తన ఇంటి వద్దే గుడిని, ప్యాలెస్‌లోనే పల్లెను కట్టేశారన్నారు. తాము అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నామని, రాజారెడ్డి రాజ్యాంగానికి భయపడమని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానం కృష్ణా జిల్లా నుంచే ప్రారంభమైందన్నారు. గుడివాడ తులసీవనంలో గంజాయి మొక్కలు పుడుతున్నాయని, టీడీపీ ఎవ్వరికీ భయపడదని చెప్పారు. తాము ఎవ్వరినీ వదిలిపెట్టమని, ప్రతి దానికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. బూతు శ్రీకి ఎమ్మెల్యే, బూతు రత్నకు ఎంపీ, బూతు సామ్రాట్టుకు మంత్రి పదవి… ఇదీ జగన్‌ చేసే రాజకీయమని విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీలను ఆదుకుంటామని, బీసీ సబ్‌ ప్లాన్‌ అమలు చేస్తామని మాటిచ్చారు. బీసీలే టీడీపీకి వెన్నెముక అని చెప్పుకొచ్చారు. పేదల అభ్యున్నతే ఎన్టీఆర్‌ లక్ష్యమని.. తాము సంపదని సృష్టించి, పేదరిక నిర్మూలన చేపడతామన్నారు. పేదలకి రూ.10 ఇచ్చి రూ.100 దోచేయడం జగన్‌ నైజమైతే.. సంపదని పెంచడం టీడీపీ సత్తా అని తెలిపారు. ఎన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చినా.. జగన్‌ గెలిచేది లేదని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని.. ఇంకా మిగిలింది 83 రోజులేనని హెచ్చరించారు. టీడీపీజనసేన విజయాన్ని ఎవరూ ఆపలేం న్నారు. తన దగ్గరే ఓనమాలు నేర్చుకున్న కొడాలి నాని తననే విమర్శిస్తున్నా డని.. తానేంటో చూపిస్తానని చంద్రబాబు ఛాలెంజ్‌ చేశారు. గుడివాడకు ప్రధాన సమస్య కొడాలి నాని అని చెప్పిన చంద్రబాబు...రాము-రావి ఇద్దరూ కలిసి కొడాలి నానిని ఓడిస్తారని.. నానిని చరిత్రహీనుడిగా కాలగర్భంలో కలిపేసేలా ఓడిరచాలని ఆయన పిలుపునిచ్చారు. గుడివాడలో బూతుల మంత్రి ఉంటే, బందరులో నీతుల మంత్రి ఉన్నారని.. పవన్‌ని తిట్టనిదే ఆ నీతుల మంత్రికి రోజు గడవదని చంద్రబాబు విసుర్లు విసిరారు. జగన్ను మించిన అక్రమార్జన చేయాలనేదే బందరు నాని లక్ష్యమన్నారు. తన పనైపోయిందని భావించే.. పేర్ని నాని తన సుపుత్రుడిని రంగంలోకి దింపారన్నారు. జోగి రమేష్‌ పెడనలో చెత్త అని, ఇప్పుడు ఆ చెత్తను పెనమలూరుకు వేశారని సెటైర్లు వేశారు. గన్నవరం ఎమ్మెల్యే పేరు చెప్పనని.. అతను తన స్థాయి కాదని తేల్చి చెప్పారు. గన్నవరం ఎమ్మెల్యే గంజాయి మొక్కని తనకు తెలియదని, తానే అతడ్ని పెంచి పోషించానని అన్నారు. ప్రస్తుతం ఏపీ మొత్తం టీడీపీ, జనసేన గాలి వీస్తోందని.. ఇది సునామీలా మారడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరో 83 రోజులే ఉందని, అందరూ అప్రమత్తగా ఉండాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే పెద్ద తప్పిదం జరుగుతుంద్నారు. టీడీపీ, జనసేన పార్టీల అవసరం ఉందని ప్రజలను చైతన్యపరచాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లాలోని 7 నియోజకవర్గా లలో టీడీపీజనసేన ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు సీటు ఇవ్వకపొయినా కూడా పార్టీ విజయానికి పూర్తిస్థాయిలో పనిచేస్తానని మాట ఇచ్చారన్నారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img