Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ప్రైవేటుకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ

బిడ్డింగ్‌ నిర్వహణకు ఇస్రో నిర్ణయం

న్యూదిల్లీ : చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే ‘ఎస్‌ఎస్‌ఎల్‌వీ’ని ప్రైవేటు రంగానికి అప్పగిం చేయాలని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) నిర్ణయించింది. ఇందుకోసం బిడ్డింగ్‌ పద్ధతిని అనుసరించాలని భావిస్తోంది. దీంతో మినీ రాకెట్‌ పూర్తిగా ప్రైవేటుపరం కాబోతోంది. దీనికంటే ముందు దిగువ భూకక్షలో 500కేజీల బరువున్న ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ఆన్‌ డిమాండ్‌ సేవలు అందించగల రాకెట్‌కు రెండు పరీక్షలు నిర్వహించాలని ఇస్రో భావిస్తోంది. ‘ఎస్‌ఎస్‌ఎల్‌వీని పూర్తిస్థాయిలో ప్రైవేటు రంగాన్ని అప్పగిచ్చేస్తాం. తయారీ ఒక్కటే కాదు’ అని ఓ అధికారి తెలిపారు. గతేడాది ఆగస్టులో ఎస్‌ఎస్‌ఎల్‌వీ తొలి ప్రయోగం విఫలమైంది. లోపాలను సరిదిద్ది ఫిబ్రవరిలో జరిపిన ప్రయోగం విజయవంతమైంది. ఈఓఎస్‌07 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన అంటారిస్‌ జానస్‌1, చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్స్‌ తయారు చేసిన ఆజాదీశాట్‌`2 ఉపగ్రహాలను 450కిమీల వృత్తాకార కక్షలోకి ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రవేశపెట్టింది. 10కేజీల కంటే తక్కువ బరువు ఉండే అతిసూక్ష్మ ఉపగ్రహాల నుంచి 100కేజీల బరువున్న వాటి వరకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ మోసుకెళ్లగలదు. ఆన్‌ డిమాండ్‌ సేవలను అందించగలదు. కాగా ఐదు పీఎస్‌ఎల్‌వీల తయారీకి హిందుస్తాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటెడ్‌, లార్సెన్‌, టౌబ్రో సంస్థలతో ఒప్పందాన్ని ఇస్రో కుదుర్చుకుంది. పీఎస్‌ఎల్‌వీ 54 ప్రయోగాలు విజయవంతమైన విషయం విదితమే. దీనిని వార్‌హార్స్‌ రాకెట్‌గా వ్యవహరిస్తారు. వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాల ద్వారా భారత అంతరిక్ష పరిశ్రమ 2025నాటికి 13 బిలియన్‌ డాలర్లను ఆర్థిక వ్యవస్థకు సమకూర్చగలదని ఇండియన్‌ స్పేస్‌ అసోసియేషన్‌కు చెందిన ఈవై ఇండియా తాజా నివేదిక పేర్కొంది. ఎస్‌ఎల్‌వీ3, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం3 తర్వాత ఎస్‌ఎస్‌ఎల్‌వీని ఇస్రో తయారు చేసింది. అయితే ఎస్‌ఎల్‌వీ`3, ఏఎస్‌ఎల్‌వీ రిటైర్‌ అయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img