Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మంతనాలు…బుజ్జగింపులు

. అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్‌ కసరత్తు
. తాడేపల్లికి ఎమ్మెల్యేల క్యూ
. సీఎం వరుస సమీక్షలు
. నేతలకు బుజ్జగింపులు

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి:వైసీపీలో సీట్ల రగడ కొనసాగుతోంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశారు. అవసరమైన చోట అభ్యర్థులను మారుస్తున్నారు. కొంతమందికి టికెట్‌ ఇవ్వలేనని నిర్మొహమాటంగా చెబుతున్నారు. భవిష్యత్‌లో అందరికీ సముచిత స్థానం కల్పిస్తానని భరోసా ఇస్తాన్నారు. అయినా కొంతమంది పక్కచూపులు చూస్తున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ బుధవారం ఎమ్మెల్యేల ఎంపికపై రోజంతా మంతనాలు సాగించారు. తాజాగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ వైసీపీకి గుడ్‌బై చెప్పారు. దీంతో వైసీపీ అధిష్ఠానం అప్రమత్తమై వివిధ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలను తాడేపల్లికి పిలిపించింది. తొలివిడతగా 11 మంది వైసీపీ ఇన్‌చార్జిల మార్పులతో చాలాచోట్ల అసంతృప్తి కనిపించింది. ఉదయం నుంచి ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం వరుసగా చర్చలు జరిపారు. క్యాంపు కార్యాలయానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీలు విజయసాయిరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలపై సీఎం కసరత్తు పూర్తి చేశారు. మిగిలిన ప్రాంతాల సమీక్షలో భాగంగా క్యాంపు కార్యాలయానికి వివిధ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను పిలిపించారు. మంత్రి ఉషశ్రీ చరణ్‌, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, కంబాల జోగులు, శంకర నారాయణ, సిద్ధారెడ్డి, అదీప్‌రాజ్‌, వాసుపల్లి గణేశ్‌, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజు తదితరులు సీఎంను కలిశారు. ఎమ్మెల్యే ఎలిజాను అమలాపురం ఎంపీగా వెళ్లాలని సీఎం సూచించగా…అందుకు ఆయన నిరాకరించారు. అనారోగ్య కారణాలతో రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు ప్రకటించారు.రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్‌కు స్థాన చలనం కలగనున్నట్లు సీఎం చెప్పారు. మొత్తం మీద వైసీపీ ఇన్‌చార్జిల మార్పుతో ఆ పార్టీలో కలవరం నెలకొంది. టికెట్లు దక్కబోవని తెలిసిన వారంతా ఇతర పార్టీలవైపు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిని గుర్తించిన అధిష్ఠానం వారికి సర్ధి చెప్పినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కాగా, తాను కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని, ఒకవేళ టికెట్‌ ఇవ్వకపోయినా…మరో చోటకు పంపినా పార్టీని వదిలేది లేదని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పష్టంచేశారు. కాగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావును రాజ్యసభకు పంపించే యోచనలో వైసీపీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img