Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

రాజకీయ నేతా… మధ్యవర్తా?

పవన్‌ తీరుపై సర్వత్రా విమర్శలు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దశదిశా లేని రాజకీయ శైలి మరోసారి రుజువైంది. ఎన్డీఏ కూటమి సమావేశానికి పవన్‌ హాజరుకావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు పవన్‌ తన ప్రసంగాల్లో చేగువేరా స్ఫూర్తిని, విప్లవ పోరాట పటిమను, పాండిత్యాన్ని అతిగా ప్రదర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే చేగువేరా ఆశయాలకు విరుద్ధంగా నడిచే ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాల బీజేపీ నిర్వహించిన ఎన్‌డీఏ సమావేశానికి పవన్‌ హాజరుకావడాన్ని వామపక్ష పార్టీలు, ప్రగతిశీల శక్తులు, మేధావులు, ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతంలో ప్రత్యేక హోదాకు బదులు పాచిపోయిన లడ్డూ ఇచ్చారని బీజేపీపై విరుచుకుపడిన పవన్‌… ఇప్పుడు అదే బీజేపీ గూటికి చేరడంపై వ్యతిరేకత పెరుగుతోంది. అంతటితో ఆగకుండా టీడీపీని కూడా బీజేపీతో జతకట్టేలా పవన్‌ ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో పవన్‌ రాజకీయ నాయకుడా? లేక మధ్యవర్తినా? అనే విమర్శలొస్తున్నాయి. మొదటి నుంచి పవన్‌ రాజకీయ శైలిలో నిలకడ లేదు. సీఎం కావడానికే ఎవరైనా పార్టీని ఏర్పాటు చేస్తారు. కానీ 2004 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమితో జనసేన కలిసింది. ఆ సమయంలో జనసేన ఎక్కడా పోటీ చేయలేదు. కూటమి విజయానికి కృషి చేశారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా రాష్ట్రాభివృద్ధికి పవన్‌ ఏ మాత్రమూ కృషి చేయలేదు. ఎన్నికల అనంతరం మళ్లీ రాజకీయాల నుంచి వెనక్కి వెళ్లి సినిమాలపై దృష్టి పెట్టారు. అప్పుడప్పుడూ అతిథిలా ఏపీకి వచ్చిపోతున్నారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి పవన్‌ కల్యాణ్‌ దూరమయ్యారు. సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీతో కలిసి జనసేన ఎన్నికలకు వెళ్లింది. విజయవాడ సింగ్‌నగర్‌ వేదికగా జరిగిన సభలో బీఎస్పీ జాతీయ నేత మాయావతి కాళ్లకు పవన్‌ నమస్కరించి, తాను దళితపక్షపాతిననే నమ్మకాన్ని ఆయా వర్గాల్లో ఎక్కించేందుకు విఫలయత్నం చేశారు. తుదకు పవన్‌ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలవ్వడం ఆయన రాజకీయ ఎదుగుదలకు పెద్ద ఆటంకంగా మారింది. రాజోలు ఎస్సీ నియోజకవర్గంలో మాత్రం జనసేన గెలిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్‌ మళ్లీ బీజేపీ గూటికి చేరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేరానంటూ నమ్మబలికారు. బీజేపీలో చేరి నాలుగేళ్లయినా వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఉమ్మడిగా ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. పైగా బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్డీఏ భేటీకి రావాలంటూ పవన్‌కు బీజేపీ నాయకత్వం ఆహ్వానం పంపిన వెంటనే హడావుడిగా దిల్లీ వెళ్లారు. ఈ సమయంలో ఆయనకు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు. విభజన హామీలను విస్మరించిన బీజేపీతో కలిసి నడవడానికి పవన్‌ వెళ్లడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
నిలకడ లేదు…స్పష్టత కరువు
రాష్ట్ర రాజకీయాలపైనా పవన్‌కు స్పష్టత కనిపించడం లేదు. పవన్‌ పార్టీ ఎందుకు పెట్టారో, ఆయన సిద్ధాంతాలేమిటో ఇప్పటి వరకు ప్రజల ముందు పెట్టింది లేదు. గోదావరి జిల్లాల్లో జరిగిన వారాహి యాత్రలో తాను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళితే చాలని చెప్పారు. మరికొన్నిచోట్ల సీఎం అవుతానన్నారు. మళ్లీ మాటమార్చి తాను సీఎం అయ్యే అవకాశం లేదని చెప్పారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే పవన్‌ కేవలం ఉభయ గోదావరి జిల్లాలు కేంద్రంగా రాజకీయం చేస్తున్నారు. అక్కడ ఉన్న 34 అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యారు. కులాలకు వ్యతిరేకమంటారు. సొంత వాళ్లే ఆదరించకపోతే ఎలా అని ప్రశ్నిస్తారు. పవన్‌ కల్యాణ్‌ ఏ విషయంలో స్పష్టంగా ఉన్నారో ఎవరికీ అర్థంకాని దుస్థితి. ఇలాంటి నిలకడలేని నాయకుడిని బీజేపీ మాత్రం భుజాలకెత్తుకుంటున్నది. ఓట్లు, సీట్లు లేని జనసేనకు బీజేపీ ఎందుకంత ప్రాధాన్య ఇస్తుందో పవన్‌ గ్రహించలేకపోతున్నారు. పవన్‌ దిల్లీ వెళ్లడమే కాకుండా టీడీపీ సైతం ఎన్డీఏలోకి వస్తే బాగుంటుందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశముందని వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img