Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

అప్పులపై అస్పష్టత

. పొంతన లేని లెక్కలతో గజిబిజి
. శ్వేతపత్రంపై జగన్‌ సర్కారు మౌనం
. ఆగని బీజేపీ, టీడీపీ ఫిర్యాదులు
. పట్టించుకోని మోదీ ప్రభుత్వం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై రగడ కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తున్నట్లు విపక్షాలు పదేపదే ఆరోపిస్తుంటే…ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని బుకాయిస్తోంది. కానీ ఆదాయం, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయానికి ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, అవినీతి, నిధుల మళ్లింపుపై ఇప్పటికే అనేకమంది కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అయినా మోదీ సర్కారు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. సీఎం జగన్‌ హయాంలో రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు టీడీపీ, వామపక్షాలు సుదీర్ఘకాలంగా ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సైతం కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ అధ్యక్షురాలు ఫిర్యాదు చేసినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. అయితే, ఏపీ అప్పులపై పార్లమెంటులో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ వేర్వేరుగా అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానమిస్తూ ఏపీ అప్పులు తక్కువేనని చెప్పుకొచ్చారు. ఏపీ అప్పులపై పురందేశ్వరి చెప్పిన లెక్కలకు, కేంద్రమంత్రి చెప్పిన జవాబుకు పొంతన కనిపించలేదు. వైసీపీ ప్రభుత్వ అవినీతిపైనా మోదీ సర్కారు స్పందించడం లేదు. మోదీ ప్రభుత్వానికి, జగన్‌ ప్రభుత్వానికి గల సన్నిహిత సంబందాలే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ అప్పులపై నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రకటన చేసిన తర్వాత…తమకు అనుకూలంగా ఉండటంతో రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెరపైకి వచ్చి పొంతనలేని లెక్కలు చెప్పారు. రాష్ట్ర అప్పు రూ. 10 లక్షల కోట్లకు చేరినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా కేవలం రూ.1.70 లక్షల కోట్లు మాత్రమే తమ హయాంలో అప్పు చేసినట్లు జగన్‌ ప్రభుత్వం చెబుతోంది.
సర్పంచ్‌ల నిధుల దారి మళ్లింపు!
గ్రామాభివృద్ధి కోసం కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న నిధులను జగన్‌ ప్రభుత్వం దారిమళ్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సర్పంచ్‌ల సంఘం నాయకుడు బాబూ రాజేంద్రప్రసాద్‌ నాయకత్వంలో సర్పంచ్‌లు ఇటీవల దిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని కేంద్రమంత్రి కపిల్‌ మొరేశ్వర్‌ పాటిల్‌కు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. పైగా ఉపాధి హామీ పథకం నిధుల చెల్లింపు ఆన్‌లైన్‌ ద్వారా చేస్తుంటే అవినీతికి ఆస్కారం ఎక్కడుంటుదని టీడీపీ ఎంపీలను కేంద్రమంత్రి ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేసింది. అనేక విషయాల్లో జగన్‌ ప్రభుత్వానికి బీజేపీ, మోదీ సర్కారు అండగా నిలుస్తోందని విమర్శలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపాదించే వివిధ బిల్లులకు వైసీపీ మద్దతు అవసరం ఉండటంతోనే మోదీ సర్కారు చూసీచూడనట్లు ఉంటుందని భావిస్తున్నారు. తాజాగా దిల్లీ సర్వీసెస్‌ బిల్లుకు సైతం వైసీపీ మద్దతిచ్చింది. రాష్ట్రాల హక్కులను హరించే ఈ బిల్లును వ్యతిరేకించడంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ విఫలమయ్యాయని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.
ఏపీ ప్రభుత్వం అప్పులపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నప్పటికీ అధికార వైసీపీ ముందుకు రావడం లేదు. అప్పులపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఆయన చెప్పే లెక్కలకు, చేసిన అప్పులకు పొంతన కనిపించడం లేదు. ఆర్థిక మంత్రిగా బుగ్గన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అప్పుల కోసం పదేపదే దిల్లీకి వెళ్లడమే సరిపోయింది. ఆయన సొంత శాఖపై సమీక్షలు మొక్కుబడిగానే కొనసాగాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏపీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తుంటే, అధికారపక్షం ఎందుకు వెనక్కి తగ్గుతుందో అంతు పట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.4.40 లక్షల కోట్లు అని కేంద్రం ఇటీవల వెల్లడిరచింది. పురందేశ్వరి మాత్రం రూ.10.77 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇతర ప్రతిపక్షాలు సైతం ఇవే విమర్శలు చేస్తున్నాయి. భారీగా అప్పులు చేయలేదని జగన్‌ ప్రభుత్వం భావించినప్పుడు శ్వేతపత్రం విడుదల చేయడానికి భయమెందుకని ప్రశ్నిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img