Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఎన్నికలకు ఎలా వెళ్దాం?

. ప్రచారంపై వైసీపీ దృష్టి
. పల్నాడులో సిద్ధం సభ
. ఇన్‌ఛార్జ్‌లను మార్చిన నియోజకవర్గాలపై ఆరా
. వైసీపీ ముఖ్య నేతలు, ఐ ప్యాక్‌ టీమ్‌తో జగన్‌ భేటీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఎన్నికలకు ఎలా వెళ్దాం… ప్రతిపక్షాల విమర్శలు ఎలా తిప్పికొట్టాలి… తదితర అంశాలపై సీఎం జగన్‌ సమాలోచన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ ముఖ్య నేతలు, ఐ ప్యాక్‌ టీమ్‌తో సోమవారం ముఖ్యమంత్రి భేటీ నిర్వహించారు. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల మార్పులపై చర్చించారు. ఇప్పటికే ఏడు విడతలుగా అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులను మార్పులు, చేర్పులు చేపట్టారు. అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు, విజయవకాశాలపై ఆరా తీశారు. సిద్ధం సభలకు వస్తున్న స్పందనతో పాటు ఎన్నికల సభలు, ఎన్నికల ప్రణాళికలపై దృష్టి పెట్టారు. త్వరలో సీఎం జగన్‌ పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సభలు, సమావేశాలను ఎక్కడెక్కడ నిర్వహించాలి, సీఎం జగన్‌తో పాటు స్టార్‌ క్యాంపెయినర్లుగా ఎవరెవర్ని పెట్టాలనే దానిపై చర్చించారు. పల్నాడులో సిద్ధం నాలుగో సభకు నిర్ణయించారు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సీఎం సిద్ధం సభలు పూర్తయ్యాయి. తొలి సిద్ధం సభను ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆయా జిల్లాల కేంద్రంగా భీమిలిలోను, ఏలూరు జిల్లా దెందులూరులో రెండో సభను ఏర్పాటు చేశారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడులో రాయలసీమ కేంద్రంగా సిద్ధం సభను నిర్వహించారు. చివరిగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కేంద్రంగా పల్నాడు ప్రాంతంలో నాలుగవ సిద్ధం సభకు సిద్ధయ్యారు. ఇప్పటికే నిర్వహించిన మూడు సిద్ధం సభలు విజయవంతం కావడంతో వైసీపీలో జోష్‌ నెలకొంది. పల్నాడులో నాలుగవ సిద్ధం సభ ఏర్పాట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్‌ ఎన్నికల పర్యటనపై ప్రణాళిక రూపొందించారు. ప్రధానంగా ఏయే జిల్లాలపై దృష్టి పెట్టాలన్న దానిపై ముఖ్య నేతలతో సీఎం చర్చించారు. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా వైసీపీ ముందుకు వెళుతోంది.
వైసీపీకి తగ్గిన ప్రచార కర్తలు
రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున సీఎం వైఎస్‌ జగన్‌ ఒక్కరే ప్రచారం చేసే పరిస్థితులున్నాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జగన్‌కు స్టార్‌ క్యాంపెయిన్లు తగ్గిపోయారు. రాష్ట్రాన్ని మొత్తం జగన్‌ ఒక్కడే ప్రచారం చేయాలి. ప్రతిపక్ష టీడీపీకి దీటుగా ప్రచారాన్ని ఎలా అధిగమించాలన్న దానిపై వైసీపీలో తర్జనభర్జన కొనసాగుతోంది. వాస్తవంగా 2019 ఎన్నికల్లో ఒక వైపు సీఎం వైఎస్‌ జగన్‌ హెలికాఫ్టర్ల ద్వారా సుడిగాలిలా ప్రచారం నిర్వహించారు. మరో వైపు కుటుంబ సభ్యుల వైఎస్‌ విజయమ్మ, షర్మిల అనేక నియోజకవర్గాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేపట్టారు. సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి కేవలం పులివెందుల నియోజకవర్గ ప్రచారానికే పరిమితమయ్యారు. చలనచిత్ర పరిశ్రమ నుంచి సినీనటుడు ఎం.మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణువర్ణన్‌, సినీనటులు జయసుధ, రాజశేఖర్‌, జీవిత, పృధ్వీ తదితరులు ప్రచారం చేపట్టారు. మంగళగిరి కేంద్రంగా లోకేశ్‌ను ఓడిరచేందుకుగాను జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ వైసీపీ గెలుపు కోసం వ్యూహరచన చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కడప జిల్లాలో వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకు గురవడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వైసీపీకి దూరమయ్యారు. కుటుంబ విభేదాలతో షర్మిల దూరమై కాంగ్రెస్‌లో చేరింది. జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మ కూడా హైదరాబాద్‌కే పరిమితమైంది. దీంతో వైసీపీలో ఇప్పుడు స్టార్‌ క్యాంపెయిన్ల కొరత పీడిస్తోంది. సినీ పరిశ్రమ నుంచి కేవలం అలీ, పోసాని కృష్ణమురళి మాత్రమే ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇది వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారనుంది.
తలనొప్పిగా మారిన షర్మిల
కాంగ్రెస్‌లో షర్మిల చేరిక వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్‌ నుంచి వైసీపీకి ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ భావించినప్పటికీ, అధిష్ఠానంపై షర్మిల దూకుడుగా చేస్తున్న విమర్శలు వారిని ఇరకాటంలో పెడుతున్నాయి. గతంలో తాను అన్న వదిలిన బాణం అంటూ వైసీపీ తరపున షర్మిల ప్రచారం చేశారు. ఇప్పుడు అదే షర్మిల కాంగ్రెస్‌ పక్షాన చేరి, వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇది టీడీపీ కూటమికి లాభమా?, నష్టమా అనేదీ ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద షర్మిల వైసీపీకి దూరమవ్వడం వల్ల ఈ ఎన్నికల్లో కొంత ప్రచారానికి లోటు కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు కుదిరితే… వారి నుంచి స్టార్‌ క్యాంపెయిన్లు అధికంగా ఉంటారు. ఒక్క టీడీపీ నుంచే చంద్రబాబు, లోకేశ్‌, భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, బాలకృష్ణ, వారి కుటుంబ సభ్యులు టీడీపీ కూటమికి ప్రచారం చేస్తారు. జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌, నాగేంద్రబాబు తదితరులు ఉంటారు. బీజేపీ నుంచి పురందేశ్వరితో పాటు కేంద్ర, రాష్ట్ర ముఖ్య నేతలు ప్రచారానికి దిగుతారు. సినీ నటులు, ప్రముఖులు టీడీపీ కూటమికి మద్దతుగా రానున్నారు. వారందరూ నలుదిక్కులా ప్రచారానికి దిగితే వైసీపీ దూకుడుకు బ్రేక్‌ పడే అవకాశం ఉంది. దీంతో ఇటీవల కాలం నుంచి తనకు ఎవ్వరూ స్టార్‌ క్యాంపెయినర్లు లేరని, ప్రజలే నా స్టార్‌ క్యాంపెయినర్లు అంటూ జగన్‌ తెరపైకి ఒక నినాదం తెస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికలకు ప్రచార కమిటీ చైర్మన్‌ను నియమించి, ఆ లోటును సరిదిద్దుకునే పనిలో జగన్‌ నిమగ్నమైనట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img