Friday, May 3, 2024
Friday, May 3, 2024

గాల్లో ఉండగా ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మృతి..

సైనిక విన్యాసాల్లో భాగంగా.. నిర్వహించే ఎయిర్ షో కోసం రిహార్సిల్స్ చేయడానికి రెండు హెలికాఫ్టర్లు గాల్లోకి ఎగిరాయి. ఇంతలోనే ఒక దానిని ఒకటి ప్రమాదవశాత్తూ ఢీకొట్టి కూలిపోయాయి. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాద దృశ్యాాలను మలేషియా నేవీ విడుదల చేసింది. ఈ ఘటనలో మరణించిన సైనికులను ఇంకా గుర్తించాల్సి ఉందని రాయల్ మలేషియా నేవీ తెలిపింది. రెండు హెలికాప్టర్లు గాల్లో ఉండగా ఢీకొన్న ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. రాయల్ మలేషియా నేవీ ప్రదర్శనలో భాగంగా ఎయిర్ షో కోసం రిహార్సిల్స్ నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. రెండు మిలిటరీ హెలికాప్టర్లు గాలిలో ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9.30 గంటలకు పశ్చిమ రాష్ట్రం పెరక్‌లోని లుమత్ నావెల్ బేస్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు మలేషియా నేవీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలోని సిబ్బంది అందరూ ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. ప్రమాదం తర్వాత హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది మృతిచెందారు.. మృతదేహాలను గుర్తించేందుకు లుమాత్ ఆర్మీ బేస్ హాస్పిటల్‌కు తరలించాం అని తెలిపింది. ప్రమాద కారణాలపై విచారణకు కమిటీని ఏర్పాటుచేసినట్టు వివరించింది. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్లను అగస్టావెస్ట్‌ల్యాండ్ ఏడబ్యూ 139 మారిటైమ్ ఆపరేషన్ హెలికాప్టర్, తేలికపాటి యూరోకాప్టర్ ఫెన్నెక్‌గా ధ్రువీకరించింది. రెండు విమానాలు ఢీకొనడానికి ముందు సుమారు ఉదయం 9.03 గంటలకు పదాంగ్ సిటియావాన్ నుంచి బయలుదేరినట్లు ప్రాథమిక నివేదిక గతంలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img