Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

ప్రజలు రామరాజ్యం కావాలంటున్నారు


.రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు
.కొడిగుడ్లపై స్టిక్కర్ వేసుకున్న నికృష్టుడు జగన్ మోహన్ రెడ్డి.
.పిచ్చి తుగ్లక్ పాలనలో ప్రజలు విసిగిపోయారు

విశాలాంధ్ర – నంద్యాల : రాష్ట్ర ప్రజలందరూ రామరాజ్యం కావాలని,రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు పేర్కొన్నారు. బిజెపి ప్రజా పోరు యాత్రలో భాగంగా మండల పరిధిలోని గుంతనాల, మిట్నాల, పుసులూరు, పాండురంగా పురం,బాపూజీ నగర్,చాపి రేవుల,ఆటో నగర్,వేంకటేశ్వర పురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ రామ రాజ్యం కావాలని,రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోడిగుడ్లపై స్టిక్కర్ లు అంటించుకున్న నికృష్టుడు, నీచుడని ఆరోపించారు. పక్షికి గూడు వుంటుంది, పిల్లవానికి అమ్మ వుంటుంది, రాజధాని లేని రాష్ట్రాన్ని చేసి పైపెచ్చు ఒక్క రాజధాని కట్టలేని జగన్ మూడు రాజధానులు కడతాదని చెప్పడం పిచ్చి తుగ్లక్ చేష్టలే అన్నారు. రాముడి విగ్రహ ప్రతిష్టకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటి పైనా జెండాలు పెట్టారని, రామరాజ్యం కావాలన్నదే ప్రజల అభిమతమన్నారు. బిజెపి ప్రభుత్వంలోనే ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు త్రాగునీరు, లైట్లు, రోడ్లు,కాల్వలు,ఉచిత గ్యాస్, పింఛన్లు, ఉచిత బియ్యం అందించారన్నారు. జగన్ ప్రభుత్వంలో మట్టి, ఇసుక మాఫియా ఎదురించేవారిపై కేసులు పెట్టిన అరాచకాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కులగొట్టడం తప్ప అభివృద్ధి కనిపించడం లేదన్నారు.శిల్పా కుటుంబం వారంలో ఒక్కరోజు వచ్చి హడావిడి చేసి ఫోటోలకు పోజులు తప్ప గ్రామాల్లో అభివృద్ధి చేయలేదన్నారు. డబ్బు అహంకారంతో అభ్యర్థులను కొనుగోలు చేసే స్థాయికి శిల్పా కుటుంభం ఎదిగిందని ఆరోపించారు. గ్రామాల్లో సర్పంచ్ లకు మనసువుంటే గ్రామ నిధులు వస్తున్నాయి లేదో చెప్పాలన్నారు.ప్రభుత్వం దోచుకోవడం తప్పా అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించదని అన్నారు.ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇచ్చి మభ్యపెట్టడమే అన్నారు. రాజధాని లేదు,మద్యపాన నిషేదం లేదు,జాబ్ క్యాలండర్ లేదు,యువతకు ఉద్యోగాలు లేవు,దేశ సౌభాగ్యం కోరుకునేది ఒక్క బిజెపి ప్రభుత్వమని అన్నారు.వైసిపి ప్రభుత్వంలో 56 కార్పొరేషన్లు పేరుకే పెట్టారు కానీ ఒక్క కార్పొరేషన్ లో ఒక్క రూపాయి లేదన్నారు. వైసిపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే బీహార్ ను తలపిస్తోందని అన్నారు. బిజెపి కి అధికారం రాష్ట్రంలో ఇస్తే రామరాజ్యం చూస్తారని అన్నారు.ఆటో నగర్ లో 20 ఏళ్లుగా శిల్పా కుటుంభానికి ఓట్లు వేసి గెలిపిస్తే కేవలం ఒక్క కాల్వ మాత్రమే అభివృద్ధి చెందిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రసాద రావు,శివ నరసింహ గౌడ్,ఉపేంద్ర రెడ్డి,లక్ష్మి రెడ్డి,మండల కన్వీనర్ గురు బ్రహ్మ,నంద్యాల పట్టణ అధ్యక్షులు కసెట్టీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img