Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

కేంద్రప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు

-బిజెపి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
…5 కోట్ల మందితో ఆడుకుందాం రా కాదు ఆడుకున్నారు.
…అరాచక,అవినీతి వైసిపి పాలనకు చమర గీతం పాడుడాం.
…వైసిపి నాయకులే శిల్పా కుటుంభం అరాచకాలు బయట పెడుతున్నారు

విశాలాంధ్ర – నంద్యాల : కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులతో రాష్ట్రప్రభుత్వం సోకులు చేసుకుంటూ అభివృద్ధి చేశామని వైసిపి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు ద్వజమెత్తారు.స్థానిక బిజెపి పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో బిజెపి ప్రభుత్వం రేపటి నుంచి నిర్వహిస్తున్న ప్రజా పోరు యాత్ర రూట్ మ్యాప్ పై ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వివరిస్తూ వైసిపి ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేసుకుంటూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బిజెపి ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం అన్నారు.5 కోట్ల ప్రజల తో ఆడుకుందాం రా కాదని ప్రజల జీవితాలతో ఆడుకున్నారు అని ఎద్దేవా చేశారు.వైసిపి అవినీతి,అరాచక పాలనకు చమర గీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు.కేంద్రం నిధులు ఇస్తే కానీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు.కేంద్రం అప్పులు ఇవ్వకపోతే పూట గడవదని అన్నారు.దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదని అన్నారు.చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేని రాష్ట్రం అన్నారు.అభివృద్ధి లేకుండా అవినీతి రాజ్యం ఏలుతున్నరని అన్నారు.కార్పొరేషన్ లకు నిధులు లేకపోవడంతో నిర్వీర్యం అయ్యాయని పేర్కొన్నారు.కార్పొరేషన్లకు కార్యాలయాలు లేవు,కుర్చీలు లేవు కేవలం కార్య కర్తల కోసం కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించారని ద్వజమెత్తారు.పరిశ్రమలు రాకపోగా ఉన్నవి పారిపోయాయన్నారు.సర్పంచ్,ఎంపిటిసి,జెడ్ పి టి సి నిధులు మళ్లించిన ఘనత రాష్ట్రానికే దక్కుతుందని అన్నారు.కరోనా సమయంలో రాష్ట్రం చేతులు ఎత్తివేయడంతో కేంద్రం అడుకుందన్నారు.రాష్ట్రం నుంచి వచ్చే కరోనా బాధితులను పక్క రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు ఆపివేశారు అని గుర్తుచేశారు.ఆసుపత్రుల్లో ఆక్షిజన్ సరఫరా చేసిన ఘనత రాష్ట్రానికే దక్కుతుందని అన్నారు.అమ్మఒడి లో రాక,రకాల జిమ్మిక్కులు ప్రదర్శించారని అన్నారు.మోసపూరిత వాగ్దానాలు చేసి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని అన్నారు.నంద్యాలలో మెడికల్ కళాశాలకు నిధులు ఇచ్చిన ఘనత కేంద్రానిదే అని నిధులు ఎవరూ ఇచ్చారో చెప్పుకోలేని దుస్తుతి రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు.రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కేంద్రం నిధులు తప్పవని అన్నారు.కేంద్రం,రాష్ట్రం,నంద్యాల అభివృద్ధి చెందాలంటే బిజెపి ప్రభుత్వం రావాలని అన్నారు.అనంతరం సీనియర్ బిజెపి నాయకులు కసెట్టీ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఢిల్లీలో బిజెపి సమావేశంలో దిశానిర్దేశం చేశారని అన్నారు. బిజెపి ప్రభుత్వంలో 10 ఏళ్లలో 5 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన వున్నవారు పైకి వచ్చారని అన్నారు.10 కోట్ల మందికి ఉచితంగా ఉజ్వల గ్యాస్ అందించారని పేర్కొన్నారు.గ్రామాల్లో శుద్ధ జలాలు,గర్భిణీ లకు పౌష్ఠిక ఆహారం,యువతకు ఉజ్వల భవిషత్తు,రైతులకు,పించాన్ దారులకు నేరుగా అకౌంట్లో,ఒలంపిక్ క్రీడాకారులకు,ప్రోత్సాహకాలు,క్రీడా నైపుణ్యం,అంగాన్ వాడి కేంద్రాలు,పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు,రైతులు లాభపడతానికి చిరు ధాన్యాల ఉత్పత్తి తో పాటు 2047 కు దేశం వికసిత భారత్ గా చూడాలన్నదే బిజెపి ప్రభుత్వం ఆశయం అన్నారు.ఈ కార్యక్రమంలో కసెట్టీ చంద్రశేఖర్,కృష్ణా రెడ్డి,స్వాతి,లింగన్న,రమేష్,మదు గోపాల్,గురు బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img