ఇంట్రావాస్క్యులర్ అల్ట్రాసౌండ్ సాయంతో స్టెంట్ అమరిక
విశాలాంధ్ర -అనంతపురం : గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే స్టెంట్ వేయడానికి ఇప్పటివరకు వేర్వేరు పద్ధతులున్నాయి. కానీ, అత్యాధునిక టెక్నాలజీ అయిన హై డెఫినీషన్ ఇంట్రా వాస్క్యులర్ అల్ట్రాసౌండ్ సాయంతో స్టెంట్ వేసి 50 ఏళ్ల మహిళ ప్రాణాలను కిమ్స్ సవీరా వైద్యులు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ మూడే సందీప్ తెలిపారు.
ఐవీయూఎస్ ఆధారిత స్టెంటింగ్, ఓసీటీ గైడెడ్ స్టెంటింగ్, రోటాబ్లేషన్ లాంటి అత్యాధునిక చికిత్సలన్నీ ఇప్పుడు అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి” అని డాక్టర్ మూడే సందీప్ వివరించారు.