Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Monday, September 30, 2024
Monday, September 30, 2024

పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే మా ధ్యేయం..

క్యాంపు చైర్మన్ బివి. వెంకటేశులు. (చిట్టి)

విశాలాంధ్ర -ధర్మవరం : పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే మా ధ్యేయము అని క్యాంపు చైర్మన్ బీవీ. వెంకటేశులు ( చిట్టి), ఆలయ అధ్యక్షులు బంధనాథం రమణ, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో 102 వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును వారు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి ఓబులమ్మ, కీర్తిశేషులు దాసరి నారప్ప జ్ఞాపకార్థం, వీరి కుమారుడు ప్రమీల దాసరి మంజునాథ్ అండ్ సన్స్ వారు వ్యవహరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి సంఘం వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో నిష్ణాతులైన వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు-చిన్న పిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ సాయి స్వరూప్- జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ సతీష్ కుమార్- ఎముకల వైద్య నిపుణులు, డాక్టర్ జైదీప్ నేత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్-హైదరాబాద్, డాక్టర్ విట్టల్, డాక్టర్ వినయ్ కుమార్- ఫిజియోథెరపీ తదితరులు రోగులకు వైద్య చికిత్సలను అందించి, ఆరోగ్య సూత్రాలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ నిర్లక్ష్యం ఉండరాదని, అలా ఉంటే ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందని వైద్యులు తెలిపారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతినెల 1వ తారీఖున 150 మంది వృద్ధులకు, ఒంటరి మహిళలకు ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున పెన్షన్ను కూడా దాతల సహాయ సహకారములతో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నాడు ఈ ఉచిత వైద్య చికిత్స శిబిరాలు, పూర్తిగా దాతల సహకారంతోనే నడుస్తున్నందున ప్రతి దాతకు పేరు,పేరునా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ శిబిరంలో 298 మంది రోగులు కు వైద్య చికిత్స అందించి ఒక నెలకు సరిపడు మందులను కూడా దాతల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. వైద్యులు మాట్లాడుతూ ఇటువంటి శిబిరాలకు తమ వంతుగా సేవాభావంతో వైద్య చికిత్సలు అందించడం మాకెంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పెద్దకోట్ల విజయ్, పెద్ద కోట్ల భాస్కర్, మామిళ్ళ అశ్వత్త నారాయణ, మేకల శివయ్య, బండి ఆంజనేయులు, వెంగముని, రామచంద్ర, కందికుంట సోము, పవన్ కుమార్, బండి మనీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img