Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

యుసిసి ప్రయత్నాలను కేంద్రం ఉపసంహరించుకోవాలి

విశాలాంధ్ర- ఉరవకొండ : ముస్లింలకు వ్యతిరేకమైన యూనిఫామ్ సివిల్ కోడ్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని ఆలోచించడం తగదని ఈ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని టిప్పు సుల్తాన్ ఇతిహాద్ హుల్ ముస్లింమిన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.రియాజ్ భాషా పేర్కొన్నారు. శనివారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ,అమిత్ షాల ఆధ్వర్యంలో దేశంలో ముస్లింల హక్కులకు భంగం కలిగించే విధానాలను అవలంబిస్తున్నారని ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు. గతంలో ఎన్ఆర్సి, సిఏఏ లాంటి చట్టాలను కూడా తీసుకురావడం జరిగిందని తాజాగా యూనిఫామ్ సివిల్ కోడ్ ను దేశం అంతా అమలు చేయాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలలో వీటిని అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని వీటిని ముస్లింలు ఎంత మాత్రం ఆమోదించారన్నారు. ఆర్టికల్ 29 ప్రకారం ప్రాథమిక హక్కులను కలిగి ఉన్నామని దేశంలో ప్రతి పౌరుడు తమ మతం ప్రకారం జీవించేందుకు రాజ్యాంగం అనుమతి ఇచ్చిందని అయితే బిజెపి ప్రభుత్వం ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను చేపట్టడం ముస్లింలు యొక్క మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ చట్టాలను రాష్ట్రంలోనూ మరియు దేశంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్తకంఠంతో ఖండించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img