Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం…

ఆరోగ్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, నా వంతుగా పూర్తిగా బాధ్యత వహిస్తానని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు ఎన్డీఏ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు విడివిడిగా వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించి, పలు విషయాలను, సూచనలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందజేయవలసిన బాధ్యత అధికారులపై ఉన్నది అని తెలిపారు.
జిల్లాలో ఎక్కడ కూడా నీటి సమస్య రాకూడదు అని, ధర్మవరంనియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి చేపట్టవలసిన కార్యచరణ ప్రణాళికలపై సంబంధిత జిల్లా, డివిజన్, మండల స్థాయి, అధికారులతో సమీక్ష సమావేశమును నిర్వహించడం జరిగిందని తెలిపారు. శాఖల వారీగా నియోజకవర్గంలో ఉన్న స్థితిగతులను మంత్రివర్యులకు, విద్య, వైద్య, నాడు నేడు, అమృత, విద్యుత్ శాఖ, ఇరిగేషన్ శాఖ, త్రాగు నీటి సమస్యపై, పంచాయతీరాజ్ శాఖ, అధికారులు వివరించారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించడానికి ఈ సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉందని అందుకు సంబంధిత అధికారులు ప్రణాళిక రూపంలో నివేదికలు నాకు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడెక్కడ తాగునీటి పైపులు లీకేజ్ ఉన్నాయో వాటిని గుర్తించి త్వరితగతిన యుద్ధ ప్రాతిపదిన పనులు పూర్తిచేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిని సక్రమమైన మార్గంలో అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు చేరవేయడంలో అధికారుల కృషి ఎక్కువగా ఉండాలని తెలిపారు, ఉపాధి పనులపై కూలీలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు, 15 ఫైనాన్స్ నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఏ ఏ రంగాలకు ఎలా అమలు చేస్తున్నారు? నివేదికల రూపంలో నాకు అందజేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో జల జీవన మిషన్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గంలో 4 మండలాలు మరియు 208 ఆవాసాలు ఉన్నాయి అని,గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం సీపీడబ్ల్యూఎస్ పథకాలు, పీడబ్ల్యూఎస్ పథకం, చేతి పంపుల ద్వారా ఈ ఆవాసాలన్నింటికీ ప్రజలకు సురక్షిత నీరు అందజేయాలని తెలిపారు.2024 నాటికి ప్రతి గ్రామీణ కుటుంబానికి55 ఎల్ పి సి డి తో ఫంక్షనల్ హౌస్‌హోల్డ్ ట్యాప్ కనెక్షన్(ఎఫ్ హెచ్ టి సి) అందించడం లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, డి ఆర్ డి పి డి నరసయ్య, ద్వా మా పీడీ విజయేంద్ర ప్రసాద్, సచివాలయ నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ మల్లికార్జునప్ప, ఆర్ అండ్ బి ఎస్ సజీవయ్య, నేషనల్ హైవే అధికారులు, నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీవోలు,ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, నేషనల్ హైవేస్, ఎంపీడీవో, ఆర్ అండ్ బి, మెడికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img