అనంతపురం- విశాలాంధ్ర : అనంతపురం పట్టణం రామచంద్ర నగర్ లో డా.లావణ్య అను డాక్టర్ ,లావణ్య పాలీ క్లినిక్ పేరు మీద వైద్య మరియు ఆరోగ్య శాఖలో అనుమతులు పొంది అనుమతులకు విరుద్దంగా కూడేరు మండలం హంసపల్లి గ్రామానికి చెందిన వేలూరు రాధ డబ్ల్యూ / ఒ రామా నాయుడు అను ఆమె కడుపు నొప్పితో వైద్యం కోసం వెళ్లగా అక్కడి డాక్టర్ రమణ నాయక్ హిస్టెక్టమీ ఆపిరేషన్ చేయగ అది వికటించి నందున వారి భర్త మరియు బంధువులు
గౌరవ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు పిర్యాదు చేయడం తో కలెక్టర్ ఆదేశాలు మేరకు
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా ఈ బి దేవి ఆసుపత్రికి చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టి నోటీస్ అందజేసి అనంతరం గురువారం సీజ్ చేయడం జరిగింది. తదుపరి చర్యలు కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్య నిపుణుల విచారణ కమిటీ నియమించడం జరిగింది .