Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో “స్వచ్ఛతా హీ సేవ 2024” కార్యక్రమం

విశాలాంధ్ర- అనంతపురం : స్వచ్ఛభారత్ మిషన్ ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛభారత్ దివస్ ను నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు నెల 17 నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతోనే స్వచ్ఛభారత్ రూపుదిద్దుకుంటుందన్న మహాత్మా గాంధీ నినాదంతో దీన్ని చేపడుతున్నారు.
స్వచ్ఛతహీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ వర్కర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎమ్మెన్వోస్, ఎఫ్ ఎన్ వో, డైట్ వర్కర్స్ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి ఇందులో భాగంగా అందరికీ రక్త పరీక్షలు, ఈసీజీ, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహించి హెపటైటిస్ బి వాక్సినేషన్ ఇవ్వడం జరిగినది.
ఈ సందర్భంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాణిక్యారావు
మాట్లాడుతూ…. హాస్పిటల్ సిబ్బంది ఆరోగ్యం మా బాధ్యత, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిపరిసరాల పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణ చేయగలరు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…. స్వచ్ఛత హీసేవ కార్యక్రమంముఖ్య ఉద్దేశ్యము మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలు ఎప్పుడైతే పరిశుభ్రంగా
ఉంటాయో వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువ
ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిశుభ్రత కోసం పాటుపడుతున్న వర్కర్స్ అందరిఆరోగ్యం మా బాధ్యతగా తీసుకొని ఈరోజు ఈ మెగా హెల్త్ క్యాంపు ని మరియు హెపటైటిస్ బి వాక్సినేషన్
కార్యక్రమాన్ని హాస్పిటల్ సిబ్బంది అందరికీ శుక్రవారం మరియు శనివారం నిర్వహిస్తున్నాము అని
పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ జి. హేమలత మాట్లాడుతూ… మహాత్మా గాంధీ
జయంతి సందర్భంగా ఆయనకు స్వచ్ఛాంజలి సమర్పించడంలో భాగంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో
స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆసుపత్రి పరిశుభ్రత కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న వారి
ఆరోగ్యం మా బాధ్యతగా తీసుకొని వారికి మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము మరియు వాళ్లకు నీడిల్స్
ప్రిక్ అయ్యో అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెపటైటిస్ బి రాకుండా అందరికీ వాక్సినేషన్
వేయించడం మా బాధ్యత. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సిబ్బంది కొరకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డి ఐ ఓ యుగంధర్,వైద్యులు, వైద్య సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img