Saturday, December 21, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాతీయ సమైక్యత అవార్డుకు ఎంపికైన ధర్మవరం వాసులు

జాతీయ సమైక్యత అవార్డుకు ఎంపికైన ధర్మవరం వాసులు

విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ దర్గా కమిటీ వారు జాతీయ సమైక్యత అవార్డుకు ధర్మవరం పట్టణానికి చెందిన జయసింహ, పోలా ప్రభాకర్, నరేందర్ రెడ్డి ఏపీకి కావడం జరిగిందని సౌత్ ఇండియా స్వచ్ఛంద సంస్థల స్వచ్ఛంద కార్యకర్త, రెడ్ క్రాస్ కోశాధికారి, ధర్మవరం నియోజకవర్గ రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్. సత్య నిర్ధారన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ముగ్గురితోపాటు సోమల రాజు ఫౌండేషన్ అధినేత శివరాజు కూడా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లా రచయితల సంఘం ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా హిందూ పురానికి చెందిన ఉమర్, కదిరి బాబా ఫక్రుద్దీన్ లు సాహిత్య రంగంలో సేవా రంగంలో చేసిన సేవలు మరుపురానివని తెలిపారు. వారిని కూడా ఎంపిక చేయడం ఆనందదాయకమని తెలిపారు. ఎంపిక చేసిన చాంద్ భాషా కు హృదయపూర్వక కృతజ్ఞతలను వారు తెలియజేశారు. వీరందరూ కూడా ఈనెల 13వ తేదీ పెనుకొండ లో అవార్డులను అందుకుంటారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు