విశాలాంధ్ర- ఆనందపురం : ఆనందపురం మండలం శొంట్యం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు సందర్భంగా విశాఖ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఆనందపురం మండల ప్రధాన కార్యదర్శి కోరుకొండ మూర్తి గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరంలో 50 మంది యువకులు జనసైనికులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ గారు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు తమ్మిన అప్పలరాజుగారు మండల కమిటీ సభ్యులు , ఆనందపురం భూత్ కమిటీ కన్వీనర్ బొద్దపు గోవింద్ గారు గ్రామ పంచాయతీ కమిటీ సభ్యులు గోంతిన ముసలినాయుడు, బొద్దపు శంకర్, గోలగాని రామకృష్ణ, పట్నాల అప్పలరాజు, బూస ఎర్రినాయుడు, సారిపల్లి సూరిబాబు, సియ్యాద్రి పవన్ కళ్యాణ్ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గున్నారు