Sunday, December 14, 2025
Homeవ్యాపారంఅమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఐక్యూ ఆఫర్లు

అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఐక్యూ ఆఫర్లు

- Advertisement -

ముంబయిః అధిక పనితీరు గల స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ అయిన ఐక్యూ, అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2025 సందర్భంగా ఐక్యూ జెడ్‌10 లైట్‌, ఐక్యూ జెడ్‌10ఎక్స్‌, ఐక్యూ జెడ్‌10, ఐక్యూ నియో 10ఆర్‌, ఐక్యూ నియో 10, ఐక్యూ 13 వంటి ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌లపై అద్భుతమైన డీల్‌లను అందిస్తోంది. ఈ సేల్‌ 12 గంటలకు అమెజాన్‌.ఇన్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఐక్యూ స్మార్ట్‌ ఫోన్లు టెక్నాలజీ ప్రియులకు అధునాతన పనితీరు, ఫ్యూచరిస్టిక్‌ అనుభవాన్ని అందించేందుకు రూపొందాయి. ఐక్యూ జెడ్‌10 లైట్‌ జెడ్‌ సిరీస్‌లో కొత్తగా వచ్చిన ఈ మోడల్‌ 6000ఎంఏహెచ్‌ బ్యాటరీ తో వస్తోంది. ఇది రోజంతా వినోదం, గేమింగ్‌, ఆఫీస్‌ వర్క్‌ వంటి కార్యకలాపాలకు సరిపోతుంది. ఇక ఐక్యూ జెడ్‌10 సిరీస్‌లో ఈ సంవత్సరం విడుదలైన ఐక్యూ జెడ్‌10, ఐక్యూ జెడ్‌10ఎక్స్‌ ఫోన్లు విద్యార్థులు, మల్టీటాస్కింగ్‌ యూజర్ల కోసం తయారు చేశారు. ఇవి మెరుగు పరచిన పనితీరు, నిరంతర కనెక్టివిటీని అందిస్తాయి. ఐక్యూ జెడ్‌10 ఎక్స్‌ ఫోన్‌లో 6500ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీ, 44డబ్ల్యు ఫ్లాష్‌ చార్జింగ్‌, 6.72-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ, ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 240హెచ్‌జెడ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 1050 నిట్స్‌ బ్రైట్నెస్‌ ఉన్నాయి. వీటితో కూడిన గేమింగ్‌ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు