వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జిన్పింగ్‌కు అమెరికా ఘనంగా స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా విమానాశ్రయంలో జిన్పింగ్ దంపతులను స్వాగతించారు. వాషింగ్టన్‌కు సమీపంలోని సైనిక విమానాశ్రయమైన జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో జిన్పింగ్ విమానం దిగగానే ట్రంప్ దంపతులు స్వాగతం పలికారు. జిన్పింగ్ కోసం అక్కడ 100 అడుగుల ఎర్రతివాచీ పరిచారు. సైనిక బ్యాండ్ సంగీతం వినిపిస్తుండగా రెండు బీ-1 బాంబర్లు గాల్లో విన్యాసాలు చేశాయి. అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శించింది. ఆరు ఎఫ్-22 యుద్ధ విమానాలు, ఆరు ఎఫ్-16 విమానాలు రన్వేపై బారులు తీరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సంధి లక్ష్యంతో అమెరికా ఆడంబరంగా జిన్పింగ్‌కు స్వాగతం పలికిందని విశ్లేషకులు అన్నారు. జిన్పింగ్ అమెరికాలో మూడు రోజులు ఉంటారు. ఆయనకు శ్వేతసౌధంలో ఫ్లైపాస్ట్, అధికారిక విందును ట్రంప్ ఇవ్వనున్నారు. జిన్పింగ్‌తో పాటు కై ఖీ, విదేశాంగ మంత్రి వాంగ్ యీ తదితరులున్నారు. జిన్పింగ్, ట్రంప్ మధ్య గురువారం ద్వైపాక్షిక భేటీ కూడా జరిగింది. కృత్రిమ మేధ, దాని వల్ల మానవాళికి ప్రమాదంతో పాటు వాణిజ్యం, అంతర్జాతీయ పరిణామాలు, తమ మధ్య సంబంధాýT మెరుగుపర్చుకోవడం, ఉద్రిక్తతలు తగ్గించడం వంటి అనేక అంశాలపై అధినేతలు చర్చించినట్లు సమాచారం. అమెరికా-చైనా భాగస్వామ్య దేశాలుగా ఉండాలని జిన్పింగ్ ఆకాంక్షించిన విషయం విదితమే.
అమెరికాలో జిన్పింగ్‌కు ఘన స్వాగతం
- Advertisement -
RELATED ARTICLES


