Thursday, December 26, 2024
Homeఅంతర్జాతీయంఅలా జరిగితేమా అస్త్రాలన్నీ తీస్తాం: పుతిన్‌

అలా జరిగితేమా అస్త్రాలన్నీ తీస్తాం: పుతిన్‌

మాస్కో: ఉక్రెయిన్‌ అణ్వస్త్రాలు సేకరిస్తేగనుక తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలను వినియోగించేందుకు వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి జో బైడెన్‌ తప్పుకునే ముందు ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలను సమకూరుస్తారన్న వార్తల క్రమంలో పుతిన్‌ ఈ మేరకు హెచ్చరికలు జారీచేయడానికి ప్రాధాన్యత ఏర్పడిరది. ‘మేము యుద్ధం చేస్తున్న దేశం అణు శక్తిగా ఆవిర్భవిస్తే మేమేం చేయాలి? మా వద్ద ఉన్న అన్ని అస్త్రాలను బయటకు తీయాలి! శుత్రు దేశ వినాశనానికి వాటిని వినియోగించాలి’ అని పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఆ దేశం ప్రతి అడుగును నిశితంగా గమనిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా ఏదైనా సరఫరా చేయాలని అనుకోవడం నాన్‌ ప్రొలిఫిరేషన్‌ కమిట్‌మెంట్ల ఉల్లంఘనే అవుతుందని ఉక్రెయిన్‌కు నాటో దేశాల సాయాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ సొంతంగా ఒక్క అణు ఆయుధాన్ని తయారు చేసుకోలేదు కానీ రోడియో థార్మిక పదార్థంతో బాంబును తయారు చేసి కాలుష్యాన్ని సృష్టించ గలదని చెప్పారు. ఒకవేళ అదే జరిగితే రష్యా ప్రతిస్పందన తగిన విధంగా ఉంటుందని పుతిన్‌ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు