Homeఅంతర్జాతీయంఆధునిక నార్వే నిర్మాతహెరాల్డ్`5 కన్నుమూత

ఆధునిక నార్వే నిర్మాతహెరాల్డ్`5 కన్నుమూత

- Advertisement -

ఓస్లో: నార్వే ఐదో చక్రవర్తి హెరాల్డ్ (89) కన్నుమూశారు. ఈ మేరకు రాజభవనం శుక్రవారం ప్రకటించింది. రాజధాని ఓస్లోలో ఉదయం 6.35 గంటలప్పుడు (స్థానిక కాలమానం ప్రకారం) ఆయన మరణించినట్లు పేర్కొంది. రక్త సంబంధిత వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్న కింగ్ హెరాల్డ్ను ఈనెల 17న ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం మరింత క్ష్మీణించింది. చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన తనయుడు హాకన్-8 (53) నార్వే పాలనా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ అధికార బదిలీని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ పర్యవేక్షిస్తుంది. కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. హెరాల్డ్ చక్రవర్తి పాలన దాదాపు మూడున్నర దశాబ్దాలు సాగింది. ఆయన ప్రజాదరణగల చక్రవర్తి. నార్వేలో రాచరిక వ్యవస్థను ఆయన ఆధునీకరించారు. సామాన్యురాలిని పెళ్లి చేసుకున్నారు. రాజ కుటుంబం ఖర్చు విషయంలోనూ ఎంతో పారదర్శకంగా వ్యవహరించారు. నార్వేకు చిట్టచివరి మొనార్క్క హెరాల్డ్5కు గుర్తింపు లభించిన విషయం విదితమే. హెరాల్డ్5 మరణించిన వార్త తెలిసిన వెంటనే నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ తన జర్మనీ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని, ఓస్లోకు తిరిగొచ్చారు. దేశ పౌరులు తమ రాజుకు నివాళులర్పించారు. ఆయన చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు. మూడు రోజుల సంతాప దినాలను నార్వే ప్రకటించింది. ఆధునిక నార్వే నిర్మాతగా పేరు తెచ్చుకున్న హెరాల్డ్5 అంతకుముందు నావికుడిగా పని చేశారు. ఒలింపిక్స్‌లో నార్వేకు ప్రాతినిధ్యాన్ని వహించారు. 1987లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సెయిలింగ్ విభాగంలో స్వర్ణం గెలిచారు. ఇదిలావుంటే, నార్వే పర్యటన సందర్భంగా భారత ప్రధాని మోదీ మే 18న హెరాల్డ్5ను ఓస్లో రాజభవనంలో మర్యాదపూరకంగా కలిశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు