వాషింగ్టన్: సిరియాలో సాయుధుల మధ్య పోరాటంలో ఇజ్రాయిల్ జోక్యాన్ని అమెరికా తప్పుపట్టింవసది. సిరియా దళాలపై దాడిని ఖండిరచింది. సుస్థిరత కోసం ప్రయత్నాలకు విఘాతం కలిగించినట్లు ఇజ్రాయిల్‌కు మొట్టికాయలు వేసింది. ఈ అంశంపై అమెరికా రాయబారి టామ్ మరాక్ స్పందిస్తూ సిరియా ప్రభుత్వానికి అమెరికా మద్దతు ఉంటుందన్నారు. సిరియాపై దాడి విషయంలో అమెరికాను ఇజ్రాయిల్ సంప్రదించలేదని చెప్పారు. సిరియాలోని స్వెయిదా రాష్ట్రంలో సాయుధ మిలీషియాకు, డ్రూజ్ మైనారిటీ వర్గానికి, సున్నీ బెడ్విన్ తెగలకు మధ్య పోరాటాన్ని ఆదివారం విరమించారు. సిరియా ప్రభుత్వం స్వెయిదాలో చిక్కుకున్న బెడ్విన్ తెగల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది
ఇజ్రాయిల్ జోక్యం తగదు : అమెరికా
- Advertisement -
RELATED ARTICLES


