మెట్టా రామారావు
పదేళ్లలో కోట్లాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించు కోలేదనే విమర్శ ఉంది. ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరత వల్ల ప్రజలకు సేవలు ఆలస్యం అవుతున్నాయి. ఉద్యోగాల కల్పనతో పాటు మెరుగైన పాలన కోసం కూడా ప్రభుత్వ నియామకాలు పెంచాల్సిన అవసరం ఉంది. 2014 నుండి ప్రతి సంవత్సరం 20 లక్షల ప్రభుత్వరంగ ఉద్యో గాలను ఎన్డీఏ ప్రభుత్వం కల్పించి ఉండవచ్చు. అందుకు అవకాశం ఉన్న ప్పటికీ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో తక్కువ మంది ప్రభు త్వ ఉద్యోగులను నియమించడం వల్లే దేశంలో పరిపాలనా లోటు ఏర్పడుతోందనే అభిప్రాయం ఉంది. సిబ్బంది కొరత వల్ల ప్రభుత్వ సేవల్లో జాప్యం జరుగుతోంది. దీంతో పాలన, ఆర్థిక, న్యాయ వ్యవస్థల సామర్థ్యం దెబ్బతినడంతో పాటు అవినీతికి అవకాశం పెరుగుతోంది అభివృద్ధి కుంటుపడుతోంది. అధ్యయనాల ప్రకారం, భారతదేశంలో ప్రతి 1000 మంది జనాభాకు 16 మంది ప్రభుత్వరంగ ఉద్యోగులు ఉన్నారు. ఇతర దేశాలలో పరిశీలిస్తే చైనాలో 57, అమెరికాలో 77, బ్రెజిల్లో 111, ఫ్రాన్స్‌లో 114 నార్వేలో 159 ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఉన్నారు. పరి పాలనను మెరుగుపరచడానికి 2014-19 మధ్యకాలంలో భారతదేశం ప్రతి 1000 మంది జనాభాకు సగటున 24 మంది ప్రభుత్వరంగ ఉద్యో గులు వుండేందుకు ప్రయత్నించాల్సింది. అలా జరిగితే ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో 50 శాతం పెరుగుదల సాధ్యమయ్యేదని ఈ విశ్లేషణ చెబు తోంది. ఆ లెక్కల ప్రకారం, 5 సంవత్సరాలలో 150 కోట్ల జనాభా 8/1000 అంటే 1.2 కోట్ల ఉద్యోగాలు లభించి వుండేవి. అంటే 2014-19 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం 24 లక్షల ప్రభుత్వ రంగ ఉద్యో గాలు లభించి వుండేవి. ఇందులో సగం అయినా ప్రతి సంవత్సరం తక్కు వలో తక్కువ 10 లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాలు లభించి ఉండేవి. 2019-24 మధ్య కాలంలో ప్రతి 1000 మంది జనాభాకు 40 మంది ప్రభుత్వ రంగ ఉద్యోగుల సంఖ్య చేరాలంటే భారతదేశం ప్రతి 1000 మంది జనాభాకు అదనంగా 16 మంది ప్రభుత్వరంగ ఉద్యోగులను కల్పించే అవకాశం ఉంది. అంటే 5 సంవత్సరాలలో 150 కోట్ల జనా భాకు ప్రతీ 1000 మందికి 16 మంది చొప్పున లెక్కిస్తే ఐదేళ్లలో 2.4 కోట్ల లభించి ఉండేవి. 2019-24 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం 48 లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండేది. అందులో సగం అయినా కల్పించి ఉంటే, ప్రతి సంవత్సరం కనీసం 20 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. దశాబ్ద కాలం అంటే 2014-24 మధ్యలో 3.6 కోట్ల అదనపు ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు అవకాశం ఉండేది. ఈ ఉద్యోగాల ద్వారా సుమారు 16 కోట్ల భారతీయులకు స్థిరమైన ఆదాయం లభించేది. ఒక్కో ఉద్యోగిపై సగటున 3.5 మంది ఆధారపడతారని తీసు కుంటే, దీని ప్రభావం కోట్లాది కుటుంబాలపై ఉండేది. అప్పుడు సుపరి పాలనకు, వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఇది దోహదపడేది. ఈ కొత్త నియా మకాలు కొత్త పింఛను పథకంలో భాగంగా ఉండడం వలన, ప్రభుత్వంపై పింఛను భారం వుండేది కాదు. కొత్త తరం ఉద్యోగ నియామకాలతో ఉద్యోగులు ఒక కొత్త స్ఫూర్తిని తెచ్చి వుండేవారు. కొత్త ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఉచిత పథకాలను అత్యంత కనిష్ట స్థాయికి పరిమితం చేయడం, పన్ను వసూళ్లను మెరుగు పరచడం, అక్రమ సంపాదనకు అడ్డుకట్ట వేయడం, ప్రజా వ్యయంలోని లీకేజీలను తగ్గించడం వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉండేది. దురదృష్టవశాత్తూ, అలా జరగలేదనే విమర్శ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వానికి పరిపాలనపై చిత్తశుద్ధి లేక ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి అధికారం కోసం పాకులాడింది. ఇక ముందు ఇలా జరగడానికి వీలుండకూడదు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎక్కువ మందికి ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించే కొత్త ప్రభుత్వానికి మార్గం సుగమం చేయాలి. ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్ల గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల లేమి వల్ల 8 కోట్ల మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు నష్టపోయారు. ఎందుకంటే, ప్రభుత్వ నియామకాల్లో సుమారు 50 శాతం వరకు ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నందున, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెరిగి ఉంటే సామాజికంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద ఎత్తున అవకాశాలు లభించి ఉండేవి. అందుకే రాజకీయ మార్పు జరగాలి.
ఐఆర్ఎస్ (వీఆర్ఎస్), ఉత్తరాంధ్ర పార్టీ అధ్యక్షుడు


