Homeజాతీయంఎన్‌టీఏ గుణపాఠం నేర్చుకోలేదు

ఎన్‌టీఏ గుణపాఠం నేర్చుకోలేదు

- Advertisement -

‘నీట’ లీక్ కేసుపై సుప్రీం కోర్టు
న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ-2026 ప్రశ్నపత్రం లీక్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు… నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ని మందలిం చింది. నీట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌టీఏకి వ్యతిరే కంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం… గతంలో జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోవడం విచారకరమని పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. గతంలో తాము ఏర్పాటుచేసిన పర్యవేక్షణ, సంస్కరణ యంత్రాంగాలను ప్రస్తా విస్తూ… వాటి అమలు ఏమైందో తెలియజేయాలని ఎన్‌టీఏను కోరింది. ఇందుకుగాను మÖడు రోజుల గడువు విధించింది. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ కావడంపై ఎన్‌టీఏకు వ్యతిరేకంగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం… ఎన్‌టీఏ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ‘గత వైఫల్యాల నుంచి ఎన్‌టీఏ ఎలాంటి గుణపాఠాలు నేర్వకపోవడం విచారకరం. ఈ అంశం గతంలోనూ న్యాయస్థానం దృష్టికి వచ్చింది. దీని కోసం నవంబర్ 14న ఓ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటుచేశాం. ఆ కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేయగా… వాటిని ఎన్‌టీఏ అంగీకరించింది. అయితే వాటిని అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టిందో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ వివరాలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు మూడు రోజుల గడువు విధిస్తున్నాం’ అని ధర్మాసనం ఎన్‌టీఏను ఆదేశించింది. పిటిషనర్ల తరఫున అడ్వకేట్ తన్వీదూబె వాదనలు వినిపించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు