ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 2026లో తమ పార్ట్నర్ స్టాక్‌కు మరిన్ని సామర్థ్యాలను జోడించింది. ‘ఐసీఐసీఐ లైఫ్ పార్ట్నర్ స్టాక్ 2.0’గా తీర్చిదిద్దింది. ఈ స్టాక్‌లో ఏఐ ఆధారిత టూల్స్, భాగస్వాములు-సిస్టమ్ మధ్య మరింత విస్తృత అనుసంధానత, సేల్స్, ఆన్‌బోర్డింగ్, కస్టమర్ సర్వీసింగ్వ్యాప్తంగా కంపెనీ అడ్వైజర్లు అలాగే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి ఉపయోగపడే డిజిటల్ సామర్థ్యాలు మొదలైనవి పొందుపర్చబడ్డాయి. డిజిటల్‌గా కస్టమర్లకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను గుర్తించడం, కొటేషన్లను జనరేట్ చేయడం, కస్టమర్లను చేర్చుకోవడం, సేవలందించడంలో అడ్వైజర్లు, డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్లకు తోడ్పాటు అందించడం ద్వారా కస్టమర్ల ప్రస్థానాన్ని మరింత సులభతరం చేసే విధంగా ఈ అప్‌గ్రేడ్ డిజైన్ చేయబడింది. ఈకోట్ యాప్ అనేది కస్టమర్ సెగ్మెంట్, జీవితంలోని దశని బట్టి సముచితమైన ప్రోడక్టులను సిఫార్సు చేసేందుకు ఏఐ ఆధారిత ప్రోడక్ట్ రికమెండర్ను ఉపయోగిస్తుంది. వ్యక్తిగతీకరించిన కొటేషన్లను జనరేట్ చేసేందుకు, షేర్ చేసేందుకు అడ్వైజర్లకు సహాయకరంగా ఉంటుంది. లివా అనే ఏఐ ఆధారిత చాట్‌బాట్ అనేది, కస్టమర్లతో సంప్రదింపులు జరిపేటప్పుడు ప్రోడక్ట్ ఫీచర్లు, కొటేషన్లను యాక్సెస్ చేసుకోవడంలో అడ్వైజర్లకు సహాయకరంగా ఉండే కన్వర్సేషనల్ ఇంటర్ఫేస్గా ఉపయోగపడుతుంది. “జీవిత బీమా సొల్యూషన్స్‌ను అర్థం చేసుకోవడంలోనూ, కొనుగోలు చేయడంలోను కస్టమర్లకు సహాయపడటంలో మా అడ్వైజర్లు, డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. సముచితమైన సొల్యూషన్స్‌ని కనుగొనడం, కొటేషన్స్‌ని జనరేట్ చేయడం నుంచి ఆన్‌బోర్డింగ్, సర్వీసింగ్ వరకు రోజువారీ కార్యకలాపాలను సరళతరం చేసే విధంగా వారికి డిజిటల్, ఏఐ ఆధారిత సాధనాలను అందించే లక్ష్యంతో ఐసీఐసీఐ లైఫ్ పార్ట్నర్ స్టాక్ 2.0 తీర్చిదిద్దబడింది. పార్ట్నర్ సిస్టమ్‌లలో ఈ సామర్థ్యాలను జోడించడం ద్వారా నిర్దిష్ట ప్రక్రియలు మరింత నిరాటంకంగా, వేగవంతంగా పూర్తి కాగలవు. తద్వారా కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని, సేవలందించడంపై మా భాగస్వాములు మరింతగా దృష్టి పెట్టేందుకు వీలవుతుంది” అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమీష్ బ్యాంకర్ తెలిపారు.


