Homeసినిమాఒకే సినిమాగా ధురంధర్ రెండు భాగాలు?

ఒకే సినిమాగా ధురంధర్ రెండు భాగాలు?

- Advertisement -

హైదరాబాద్: ‘ధురంధర’ పార్ట్1, పార్ట్2 సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7.30 గంటల రన్‌టైమ్‌తో కొత్త వెర్షన్‌ను ప్రేక్షకుల కోసం రెడీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వెర్షన్‌ను కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో అదీనూ వారాంతంలో ఐమాక్స్, హెచ్‌డీఆర్ ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మేకర్స్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ దాదాపు ఎనిమిది గంటలు ప్రేక్షకులను థియేటర్ సీట్లలో కూర్చొబెట్టాలంటే సవాలుతో కూడుకున్న పనే. సినీ ప్రేమికులు మాత్రమే ఇంతటి రన్‌టైమ్ ఉన్న సినిమాను చూసేందుకు ఇష్టపడతారు. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఇది చర్చల దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ధురంధర్‌లో రణ్‌వీర్ సింగ్ లీడ్‌రోల్‌లో హంజా పాత్రలో ఒదిగిపోయారు. గతనెల 19న విడుదలైన సినిమా రెండో భాగం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటిదాకా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లు వసూలు చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు