బ్రసీలియా: ఒపెక్ ప్లస్ కూటమిలో చేరాలని బ్రెజిల్ నిర్ణయించుకుంది. పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) భాగస్వామి కాబోతున్నట్లు బ్రెజిల్ మంత్రి అలెగ్జాండ్రా సిల్వేరియా తెలిపారు. ఒపెక్ ప్లస్‌లో చేరడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. నవంబరులో జరగబోయే 30వ ఐరాస వాతావరణ మార్పు సదస్సు (కాప్ 30)కి బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనున్న క్రమంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడిరది. ఇంధన రంగంలో సహకారం, చర్చలకు సంబంధించి నూతన అధ్యాయం మొదలు కాబోతుండటం బ్రెజిల్‌కు, ఇంధన పరిశ్రమకు చరిత్రాత్మకమైన సమయం అని సిల్వేరియా అన్నారు. ‘ఇంధన ఉత్పత్తి దేశాల వ్యూహాలపై చర్చించే ఫోరమిది. ఇంధన ఉత్పత్తిదారులుగా ఉండేందుకు మేము సిగ్గుపడరాదు’ అని జాతీయ ఇంధన విధాన మండలితో సమావేశం అనంతరం సిల్వేరియా వెల్లడిరచారు.