Wednesday, February 18, 2026
Homeజిల్లాలువిశాఖపట్నంఒప్పో ఇండియా రెనో15 సిరీస్ ఆవిష్కరణ

ఒప్పో ఇండియా రెనో15 సిరీస్ ఆవిష్కరణ

- Advertisement -
  • ఏఐ పోర్టెరైట్ కెమెరా, పూర్ టోన్ టెక్నాలజీ, పాపౌట్ ఫీచర్లతో ట్రావెల్ ఫొటోగ్రఫీకి చిరునామా విశాఖపట్నం : ఒప్పో ఇండియా ఈ రోజు తన ప్రీమియం రెనో15 సిరీస్‌ను మూడు వేరియంట్‌లతో రెనో15 ప్రో, రెనో15 ప్రో మినీ, రెనో15 ఆవిష్కరించింది. యువ ప్రయాణికులు, ఫోటోగ్రఫీ ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ సిరీస్లో ఆధునిక కెమెరా సిస్టమ్‌, ఇంటెలిజెంట్ ఏఐ, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయి. ప్రకృతి అంశాల ఇన్స్పిరేషన్ తో కలర్ ఫినిష్‌లు, ప్రపంచంలో తొలి హోలోఫ్యూజన్ టెక్నాలజీ తో, రెనో15 సిరీస్ కాంపాక్ట్, సౌకర్యవంతమైన ఆకృతిని బలమైన నిర్మాణ నాణ్యతతో కలిపి అందిస్తుంది. రెనో15 ప్రో, రెనో15 ప్రో మినీ 200ఎంపీ కెమెరాతో ఫోటోగ్రఫీని కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. అద్భుతమైన క్లారిటీని అందిస్తాయి. దీన్ని 50ఎంపీ 3.5ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్, 120ఎక్స్ డిజిటల్ జూమ్, పూర్ టోన్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఏఐ ఎడిటింగ్ టూల్స్తో అందిస్తుంది. ఈ సందర్భంగా ఒప్పో ఇండియా కమ్యూనికేషన్స్ హెడ్ గోల్డీ పట్నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో 100 మిలియన్లకు పైగా ఒప్పో యూజర్లు ఉన్నారన్నారు. వినియోగదారుల అంచనాలు ప్రీమియం అనుభవాల వైపుకు మారుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా కెమెరా సిస్టమ్‌లు, ఇంట్యూయిటివ్ ఏఐ, ప్రత్యేక డిజైన్, సమగ్ర యూజర్ అనుభవం పరంగా. రెనో సిరీస్ నిరంతరంగా సాధిస్తున్న విజయం మా నిబద్ధతను చాటుతోందన్నారు. వినియోగదారులు కేవలం చిన్నపాటి మార్పుల కంటే, తమ రోజువారీ జీవితంలో నిజంగా ఉపయోగపడే ఫీచర్లనే కోరుకుంటున్నారని ఇది నిరూపిస్తుoదన్నారు. గణనీయంగా అభివృద్ధి చెందిన ఇమేజింగ్ సిస్టమ్, లోతైన ఏఐ సామర్థ్యాలు మరింత శక్తివంతమైన ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ అందిస్తూ, యువ భారతీయులు ఎలా ప్రయాణిస్తారో, సృష్టిస్తారో, వారి క్షణాలను ఎలా కాప్చర్ చేసుకుంటారో అనేదానిని దృష్టిలో పెట్టి రూపకల్పన చేయబడిందని తెలిపారు. ఒప్పో తన కొత్త హోలో ఫ్యూజన్ టెక్నాలజీని పరిచయం చేస్తోందన్నారు. ఇది స్మార్ట్‌ఫోన్ అందాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తుందని తెలిపారు. వన్ పీస్ స్కల్ప్టెడ్ గ్లాస్ డిజైన్‌పై, త్రీ డైమెన్షనల్ పొరల వంటి ఎఫెక్ట్‌ను వాడటం ద్వారా ఫోన్‌కు మంచి డెప్త్, పట్టుకుంటే ఒక విభిన్నమైన స్పర్శ కాంతి పడినప్పుడు మెరిసే సరికొత్త రూపాన్ని ఇది అందిస్తుందన్నారు. దీనికి తోడుగా ఒప్పో డైనమిక్ స్టెల్లార్ రింగ్ డిజైన్ ఉందన్నారు. కెమెరా లేఅవుట్‌ని అందంగా ఇంటిగ్రేట్ చేసి, దీని చుట్టూ కాంతి పడినప్పుడు హాలో గ్లోతో కనిపిస్తూ ఫోన్ వెనుక భాగం ఎక్కడా గ్యాప్స్ లేకుండా చాలా నీట్‌గా, అందంగా కనిపిస్తుందన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు