Monday, February 24, 2025
Homeవిశ్లేషణఓటమి పాఠం నేర్పాలి

ఓటమి పాఠం నేర్పాలి

నిత్య చక్రవర్తి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొంది పాలక ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఓటమి చెందడంతో ఇండియా ఐక్యసంఘటనకు గట్టి దెబ్బతగిలింది. అంటే దీని అర్థం ఆప్‌ లేదా ఇండియా ఐక్య సంఘటన అంతిమంగా కూలిపోయిందని కాదు. కొంతమంది మీడియా, టీవీ ఛానల్స్‌ వ్యాఖ్యాతలు ఆప్‌, ఇండియా ఐక్య సంఘటన పని అయిపోయిందని మాట్లాడు తున్నారు. గెలుపోటముల విషయాలను మాత్రమే గమనంలోకి తీసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు దఫాలు ఆప్‌ గెలిచి పరిపాలించింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 1వ తేదీన 2025`26 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలలో 12లక్షల వరకు ఆదాయపు పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం, 8వ వేతన కమిషన్‌ వేయడానికి అంగీకరించ డంతో మధ్యతరగతి వేతన జీవులు, ఇతరులు ఆకర్షితులై బీజేపీకి ఓటు వేశారనడంలో ఏ మాత్రం అనుమానంలేదు. రెండు పార్టీల మధ్య 2శాతం ఓట్లు మాత్రమే తేడా ఉంది. బడ్జెట్‌ ఆప్‌ని గణనీయంగా దెబ్బతీసింది. అంతమాత్రం చేత బీజేపీ గెలుపు, ఆప్‌ ఓటమికి మధ్య గొప్ప తేడా ఉందని భావించరాదు. దిల్లీ ఓటర్లలో మధ్యతరగతి వేతన జీవులు 1.56శాతం ఉన్నారు. దాదాపు వీరంతా బీజేపీకే ఓటు వేసి ఉంటారు. ఆదాయపు పన్ను ఊరట వీరిని ఎక్కువగా ప్రభావితం చేసింది. బీజేపీకి 45.56శాతం ఓట్లు లభించగా, ఆప్‌కి 43.57శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 48సీట్లు రాగా, ఆప్‌కి 22సీట్లు వచ్చాయి.
ఇండియా ఐక్య సంఘటనలో భాగస్వాము లైన ఆప్‌, కాంగ్రెస్‌ ఓట్లు కలిసి మొత్తం 50శాతం ఓట్లున్నాయి. సీట్ల విషయం చూస్తే, 14సీట్లు అదనంగా వచ్చేవి. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నట్లయితే 70 సీట్లలో 36సీట్లు గెలిచి కనీస మెజారిటీతో విజయం పొందేవారు. దళితులు, పేదలు, ముస్లింలలో ఆప్‌ బలం ఇప్పటికీ అలాగే నిలిచింది. ఆప్‌ ఓట్లు పడిన విధానం ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. మధ్యతరగతి ఓటర్లు ఆప్‌ నుంచి బీజేపీకి బదిలీఅయ్యారు. పేదల ఓట్లు ఆప్‌, కాంగ్రెస్‌కు దాదాపు పదిలంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్‌, కాంగ్రెస్‌లు పొత్తు అంశంలో క్షేత్రస్థాయి పరిస్థితులను ఆలోచించలేదు. ఒక పార్టీపై మరోపార్టీ వ్యతిరేకంగా ఆలోచించాయి. ఈ ఎన్నికల్లోనే కాకుండా మధ్యప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ఆలోచించి దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు క్షేత్రస్థాయి పరిస్థితిని లోతుగా పరిశీలించి సయోధ్య కుదుర్చుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్‌ ఈ విషయంలో తప్పుదారి పడుతోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనైనా ఇండియా ఐక్యసంఘ టన పార్టీల మధ్య సయోధ్య కుదిరి కలిసికట్టుగా పోటీ చేసేలా చూడవలసిన పెద్దబాధ్యత కాంగ్రెస్‌ మీద ఉంది. ఓటమిని కేజ్రీవాల్‌ అంగీకరించి ప్రతిపక్షపార్టీగా బాధ్యతగా పనిచేస్తానని వాగ్దానం చేశారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఇది ప్రజాస్వామ్య విధానం.
ప్రస్తుతం ఏర్పడనున్న రాజకీయ పరిస్థితిని పరిశీలించాలి. ఇంతవరకు ఆప్‌ పంజాబ్‌, దిల్లీ రాష్ట్రాల్లో పరిపాలిస్తోంది. ఇప్పుడు దిల్లీలో ఓటమిపాలైంది. పంజాబ్‌లో మాత్రమే అధికారంలో ఉంది. పంజాబ్‌ మీద బీజేపీ గట్టిగా దృష్టిపెడుతోంది. బీహార్‌లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఆ రాష్ట్రంపై ఉన్నతస్థాయి నాయకత్వం అన్ని రకాలుగా దృష్టి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం ఎలాంటి విధాలనైనా ఆచరించేందుకు వెనుకాడకపోవచ్చు. ఈ సంవత్సరం చివరిలో పంజాబ్‌, బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం ఒడిదుడుకుల పాలయ్యే అవకాశాలు న్నాయి. ఇందుకు బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. దిల్లీ, పంజాబ్‌లో ఎన్నికల విధానంలో కొన్ని పోలికలున్నాయి. పంజాబ్‌లో ఆప్‌ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిరచింది.
ఈ నేపథó్యంలో ఆప్‌ను ఓడిరచాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ క్రియాశీలంగా పనిచేస్తోంది. అదే సమయంలో బీజేపీ కూడా తన పరిస్థితిని రాష్ట్రంలో మరింత విస్తరించేందుకు చిన్నచిన్న పార్టీలను కొత్తగా తనతో కలుపుకునిపోయేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ కూడా ఆప్‌, కాంగ్రెస్‌పైన పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఆప్‌,కాంగ్రెస్‌ పొత్తు కుదుర్చుకోకపోతే త్రిముఖ పోటీ జరుగుతుంది. మళ్లీ దిల్లీలో వచ్చిన ఫలితమే రావచ్చు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆప్‌, కాంగ్రెస్‌ పొత్తు కుదుర్చుకోవడం వల్ల మేలు జరగవచ్చు. బీహార్‌లో ఇండియా ఐక్య సంఘటన భాగస్వాములు కలిసికట్టుగా ఎన్నికలలో పాల్గొనవలసిన అవసరం ఎంతైనాఉంది. అది కూడా ఇప్పటికే పనిచేస్తున్న మహాఘట్‌బంధన్‌ ఎటువంటి అరమరికలు లేకుండా ఆర్‌జేడీ నాయకత్వంలో, నితీష్‌్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని సమర్ధ మంతంగా ఎదుర్కోవాలి. సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఎంతైనా అవసరం. ఎన్నికలకు చాలా ముందుగానే ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు విషయంలో చర్చించి సర్దుబాటు కుదుర్చుకుని కలిసికట్టుగా ప్రచారం సాగించాలి. బీహార్‌లో సీపీఐ(ఎమ్‌ఎల్‌) కు కార్మికవర్గంలో బలమైన పట్టు ఉంది. ఆర్‌జేడీ, కాంగ్రెస్‌, వామపక్షపార్టీలైన సీపీఐ, సీపీఐఎం, సీపీఐ(ఎమ్‌ఎల్‌) మధ్య పటిష్టమైన సయోధ్యకుదిరే అవకాశం ఉంది. వామపక్షాలు 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 19సీట్లలో పోటీచేసి 12 సీట్లలో గెలుపొందాయి. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఆర్‌జేడీ ఈ అంశాన్ని గమనంలోకి తీసుకుని సహకరించవలసి ఉంది. హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను గుర్తించి సయోధ్యతో కలిసి పోటీచేసి తప్పనిసరిగా విజయం సాధించ వలసిన అవసరం ఇండియా ఐక్యసంఘటనకు ఉన్నది.
ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ గట్టి విశ్వాసంతో పనిచేస్తోంది. మహారాష్ట్ర, హర్యానా, యూపీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ధీమాతో బీజేపీ పనిచేస్తోంది. గెలుపు ఓటములు సాధారణమే. అయితే ఓటమి నుంచి తగిన పాఠాలు నేర్చుకుని జరిగిన తప్పులను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను అనుసరించాలి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన తప్పులను గుర్తించిన బీజేపీ సరిదిద్దుకుని దిల్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొం దింది. బీజేపీ విధానాన్ని గుర్తించి ఇండియా ఐక్య సంఘటన భాగస్వామ్యపార్టీలు కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో పోటీచేయాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు