Wednesday, January 1, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికరెంటు చార్జీల పెంపుదలపై వైసీపీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదం…

కరెంటు చార్జీల పెంపుదలపై వైసీపీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదం…

చల్లా శ్రీనివాసులు
సిపిఐ పార్టీ ముదిగుబ్బ మండల కార్యదర్శి
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ; రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల కరెంటు చార్జీలు పెంచిన నేపథ్యంలో వైసీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుండడం చాలా హాస్యాస్పదంగా ఉందని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు శుక్రవారం ముదిగుబ్బలో ఒక ప్రకటనలో వైసీపీ నాయకుల వ్యవహార శైలపై ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు గత ఐదేళ్ల కాలంలో 8 నుంచి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వ నాయకులు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆందోళన కార్యక్రమాలు చేయడం సబబుగా లేదని పేర్కొన్నారు, కాగా అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కూడా పూర్తి కాకనే కరెంట్ చార్జీలు పెంచిన ఎన్ డి ఏ ప్రభుత్వం మరోవైపు ఇది మా తప్పుకాదని వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలు వలనే కరెంటు చార్జీలు పెరిగాయని చెబుతుండడం మరింత విడ్డూరంగా ఉందని ఆయన ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించారు,
ఏది ఏమైనా గతంలో వైసిపి నేడు ఎన్ డి ఏ ప్రభుత్వాలు రెండు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తున్నారని, దొందు దొందే అన్న రీతిలో తరచూ కరెంటు చార్జీలు పెంచుతూ ఆర్థికంగా సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు, ఇది ఇలా ఉండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో మండల ప్రజలతో కలిసి త్వరలోనే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ముదిగుబ్బ విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని
ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు