Wednesday, June 25, 2025
Homeఅంతర్జాతీయంకాల్పుల విరమణ కోసం ట్రంప్‌ బతిమాలారు: ఇరాన్‌

కాల్పుల విరమణ కోసం ట్రంప్‌ బతిమాలారు: ఇరాన్‌

తెహ్రాన్‌: ఇజ్రాయిల్‌`ఇరాన్‌ మధ్య భీకర పోరు క్రమంలో కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమను బతిమాలారని తెహ్రాన్‌ వెల్లడిరచింది. ఇజ్రాయిల్‌కు మద్దతుగా అమెరికా కూడా రణరంగంలోకి దిగి ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై దాడి చేసింది. దీంతో ఇరాన్‌ ప్రతీకార దాడులు చేసింది. ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో ట్రంప్‌ వెనక్కి తగ్గి కాల్పుల విరమణ కోసం ఇజ్రాయిల్‌ను బలవంతంగా ఒప్పించారని, ఆపై తమను బతిమాలారని ఇరాన్‌ వెల్లడిరచింది. ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి విజయవంతం కావడంతో కాల్పుల వివరణ కోసం ట్రంప్‌ ముందుకొచ్చినట్లు ఇరాన్‌ మీడియా చెబుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు