Monday, April 21, 2025
Homeఅంతర్జాతీయంకెనడాలో హిందూ ఆలయంపై దాడి

కెనడాలో హిందూ ఆలయంపై దాడి

ఒట్టావా: కెనడాలోని సిక్కు వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. ఖాలిస్థానీ జెండాలతో ఏప్రిల్‌ 19న సర్రేలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయం వద్ద వీరంగం సృష్టించారు. వారి దాడిలో దేవాలయ ప్రవేశద్వారం, స్తంభాలు ధ్వంసమయ్యాయి. శనివారం ఉదయం 3గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులు ఖాలిస్థానీ నినాదాలు చేస్తూ ఆలయంలోకి ప్రవేశించి స్తంభాలు, ద్వారాలపై ఖాలిస్థానీ అనుకూల రాతలు రాశారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆధారాలు దొరకకుండా సీసీటీవీ కెమెరాలు దొంగలించారని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే ఇటువంటి ద్వేషపూరిత విధ్వంసాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేశామని స్థానిక పోలీసులు వెల్లడిరచారు. ఘటన వెనుక భారత వ్యతిరేక శక్తుల హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. మళ్లీ ఇటువంటి దాడులు జరగకుండా ఆలయం వద్ద భద్రతా దళాలు మోహరించాయని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు