Homeవిశ్లేషణగం…గణపతి

గం…గణపతి

- Advertisement -

చింతపట్ల సుదర్శన్

భూమికి శాపంగా మారిన ఎల్‌నినో కారణంగా వర్షాకాలం కూడా డ్యూటీ చెయ్యవలసి వస్తున్నదని విసుక్కుంటూ మబ్బుల్లోకి వస్తున్నాడు సూరీడు. తెల్లవారుఝ²మున చల్లటి గాలికి కునుకు పట్టిన డాగీ, ఒంటి మీది నుంచి ఏ ప్రాణో గంతులేస్తూ పోవడంతో ఉలిక్కిపడి లేచి కూచుంది. గోడకున్న కన్నంలో నుంచి తొంగి చూస్తున్నది దాని ఒంటి మీద పరుగులు తీసిన ఎలుక. ‘యమూ టైనీ ఫెలో! వేలెడంత లేవు ! నామీదే వీరంగమా! ఒక్క ‘బైట్ ‘ఇచ్చానంటే ‘ అని అరిచింది డాగీ. దాని అరుపులకు నిద్దర తేలిపోయిన డాంకీ ‘పొద్దున్నే మొదలెట్టావా?’ అంది కళ్లు తెరవకుండానే. ‘నీకేం నువ్వు హాయిగా గుర్రుకొట్టావు కానీ ఈ ‘లిటిల్ రాస్కెల్’ నా నిద్ర చెడగొట్టింది. అరవని కరవని కుక్కలెక్కడా ఉండవు అన్నాడు కదా ఓ కవి. ఈ రెండు పనులూ రాÅ£పోతే నేను డాగీని ఎలా అవుతాను. కళ్లు తెరిచి చూడు ఇది నా మీద కూచిపూడి, భరతనాట్యం, కథాకళి వంటివి చేసి ఇప్పుడు గోడ కన్నంలో దూరింది అంది డాగీ. ఎవరది? అంటూ కళ్లు తెరిచి చూసింది డాంకీ. తర్వాత లేచి సర్దుకు కూచుని ‘ఇంకా నయం తొందరపడి దాన్ని ఏమి చెయ్యలేదు డాగీ బ్రో ఎవరనుకున్నావు ? ’ అంది. ఎవరో నువ్వే చెప్పు పార్టీ ఫిరాయించినందుకు కోర్టు అనర్హత వేటు వేసిన ఎం.ఎల్.ఏనో, ఎంపీనో కాదు గదా? అంది డాగీ. ‘అంతకంటే ఎక్కువే మన మైదానంలో వినాయకుడున్నాడా?’ ‘ఉన్నాడు. వారం రోజుల్నించీ చూస్తూనే ఉన్నాం కదా!’ ఆ గజముఖుడి వాహనమే నీ ఒంటి మీద తైతక్కలాడి కన్నంలో దూరింది దాని జోలికి వెళ్లేవో శివకుమారుడి తొండం దెబ్బలు తప్పవు నీకు’ అంది డాంకీ. ‘అవునా! మన కాలనీ వాళ్లు చందాలు వసూలు చేసి మైదానంలో నిలబెట్టిన వినాయకుడి వాహనమా ఈ కన్నంలో ఎలుక’ అంది డాగీ. ‘నిలబెట్టిన కాదు కంఫర్టబుల్గా కూచోబెట్టిన అను తొమ్మిది రోజులు కదలకుండా నిలబడి ఉండటం అంత ఈజీ ఏం కాదు’ అంది డాంకీ. ‘అది సరే! బాస్‌ని వదిలేసి ఇలా వచ్చి నిద్దరోతున్న నామీద ‘జులుం’ చెయ్యడం న్యాయమేనా మైడియర్ ఆర్‌ఏటీ ర్యాట్’ అనడిగింది డాగీ కన్నంలో నుంచి చిన్న కళ్లు మిటకరిస్తూ చూస్తున్న మూషికాన్ని వదిలేసి రాక తప్పలేదు బ్రో డాగీ! రాత్రి ఒంటి గంట దాకా డీజే మోత వినలేక ఆయన మానాన ఆయన్ని ‘వదిలేసి రాక తప్పలేదు. అసలే నా చెవులు చిన్నవి ఎక్కడ చిల్లు పడతాయేమోనని భయం. బాస్‌కి ఆ సమస్యే లేదు చేటంత చెవులు కదా! ప్రతి ఏడూ వినటం అలవాటే కద!’ అన్నాడు మూషిక్. ‘అవునవును. చేటంత చెవులున్నా వినిపించుకోడనుకుంటా. ప్రజలూ, ప్రతిపక్షం అరిచి గీపెడుతున్నా సర్కారు వారు వినిపించుకోరు కదా’ అంది డాంకీ. ‘ఆయన వినిపించుకోనీ, కోక పోనీ ఆయన పక్కనే ఉండాల్సిన ఈ ఎలుక ఇలా ఆయన్నీ ఆయన చేత ఉన్న లడ్డూని వదిలేసి రావడం ‘సేఫ్’ కాదు గదా. రేపో ఎల్లుండో వేలం వేసే ఆ లడ్డూని ఏ దొంగోడన్నా ఎత్తుకుపోతే’ అంది డాగీ. ‘ఏంటి డాగీ నువ్వు మరీనూ… నేనాయన ‘వెహికిల్’నే కానీ సెక్యూరిటీ గార్డుని కాదు గదా! మీ మంత్రులూ, ప్రజాప్రతినిధులూ తాము చేసే అడ్డమైన పనులకు ఎవడైనా ఆగ్రహించి ‘అటాక్’ చేస్తారేమోనని ‘గన్మెన్’ లను పెట్టుకుంటారు. స్వంత ఖర్చు మీద కాదనుకో కానీ మా బాస్‌కు ఏ సెక్యూరిటీ అవసరం లేదు. ఆయన చూసుకోడూ ఆల్రెడీ ఒక దంతం వాడేసినా ఇంకోటి ఉంది కదా ’!అన్నాడు మూషిక్. ‘అసలే బరువు శరీరం కదల్లేడు. నాలుగు చేతులు ఉన్నా లాభం ఏమిటి ప్రతి చేతిలో ఏదో ఓటి ఉంటుంది. వెనుక చేతులు ముందుకు చాచలేడు. ముందుండే రెండు చేతుల్లో ఓ దానిలో గట్టిగా కట్టేసిన లడ్డూ ఇంక తను మాత్రం ఏం చేయగలడు చెప్పు’ అంది డాంకీ. ‘ఒక చేయి ఖాళీనే కదా’ అన్నాడు ఎలుక్. ‘ఖాళీ కాదది అభయహస్తం నేన్నుానని మీకేం కాదని చెప్పేది అది కదిలించడానికి వీల్లేదు దాని కోసమే కదా జనం ఆయన్ని కూచోబెట్టేదీ, నించోబెట్టేది’ అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి. ‘చేతులు ఖాళీ లేకపోతేనేం తొండం ఉండనే ఉంది’ అంది ఎలుక అబ్బాయి వైపు అనుమానంగా చూస్తూ. ‘డోంట్ ఫియర్ ! మన ఫ్రెండే’ అంది డాంకీ. “ఇంతకీ వేలం వేసి వేలు పోగేసే లడ్డూని ఎవడైనా ఎత్తుకు పోతాడనా? అన్నాడబ్బాయి. ‘ప్రసాదాలు రోజుకొకరు సమర్పిస్తారు, విగ్రహం ఒకాయనిస్తాడు. అన్నదానం చేస్తారొకరు సరే చిన్నాచితకా ఖర్చులకు చందా డబ్బులుంటయి మరి ఈ లడ్డూ వేలం వేలు ఏమయితయో’ అంది డాగీ. ‘ప్రజల సొత్తు తినే హక్కు నాయకులందరికీ ఉంటుంది. లీడ్ చేసేవాడే లీడర్. సక్రమ సంపాదన కాలం కాదిది అక్రమ సంపాదన సీజన్ ఇది. ఇంకో నాలుగు రోజులైతే గణపతి కాలవలో తేలాల్సిందే కద’ అన్నాడు అబ్బాయి. ఇన్నాళ్లుప్రసాదాలు ముందు పెట్టి తామే తినేసిన భక్తులు ఏ మురికి నీటి చెరువులోనో ఆయన్ను ముంచేస్తారు. ఆయనతో పాటు నేనూ మునగాల్సిందే! తెల్లవారింది నేను కనపడకపోతే వాళ్ల అమ్మకో నాన్నకో ‘కంప్లెయింట్’ చేస్తాడు వస్తా అంటూ కలుగులో నుంచి బయటకు వచ్చి మండపం వైపు దౌడు తీశాడు మూషిక్. ఎల్‌నినో వల్ల కరువు రాబోతుందంటున్నారు. ధరలు ఆకాశానికి చిల్లు చేసుకుని ఇంకా పైకి పోయినట్టున్నవి. యూపీఐ మీద చార్జీల బాదుడు మొదలైంది. దేశంలో పాతిక శాతం మంది నాలాగ పనీ పాటా లేని వాళ్లేనట అంటూ అరుగు దిగాడు అబ్బాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు