టోక్యో: జపాన్‌లో గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత అతిపెద్ద కార్చిచ్చు వ్యాపించింది. దీంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటి వరకు 4,500 ఎకరాల్లో అటవీ సంపద కాలి బూడిదయ్యింది. ఈ మంటలు అసలు ఇప్పట్లో తగ్గేలా లేవని అధికారులు చెబుతున్నారు. ఆ దేశ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం ఈ కార్చిచ్చును తొలుత బుధవారం గుర్తించారు. నాడు కనీసం 84 ఇళ్లను ఇది కాల్చేసింది. అదే సమయంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం దాదాపు 4,600 మందిని ఇళ్లు ఖాళ్లీ చేయాలని ఆదేశించారు. 1,200 ఇళ్లలోని వారిని అత్యవసర వసతి ప్రదేశాలకు తరలించారు. దాదాపు 1,700 మంది సిబ్బంది మంటలను ఆర్పేందుకు తరలించారు. సహాయక చర్యల కోసం విమానాలను కూడా రంగంలోకి దించారు. 1992లో హోక్కైడో వచ్చిన కార్చిచ్చుతో పోలిస్తే ఇది చాలా పెద్దది. నాడు అది 1,000 హెక్టార్ల అటవీ భూమిని దగ్ధం చేసింది.
కరోలినా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధింపు
అమెరికాలోని ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లోనూ కార్చిచ్చు వ్యాపించింది. ఇప్పటికే వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది దానిని ఆర్పేందుకు తీవ్ర స్థాయిలో యత్నిస్తున్నారు. దక్షిణ కరోలినా రాష్ట్ర అటవీ సంరక్షణ విభాగం ప్రకారం… ఇప్పటికే 4.9 చదరపు కిలోమీటర్ల మేరకు అటవీ భూమి దగ్ధమైపోయింది. ఇప్పటి వరకు ఈ కార్చిచ్చులో ఎవరు గాయపడినట్లు, ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం లేదు. సౌత్ కరోలినాలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్ ప్రకటించారు. ఇక పరిస్థితిని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తునట్లు వెల్లడిరచారు. మొత్తం 175 ప్రదేశాల్లో మంటలు వ్యాపించాయని వెల్లడిరచారు.
జపాన్‌లో అతిపెద్ద కార్చిచ్చు
RELATED ARTICLES