Sunday, February 8, 2026
Homeవ్యాపారంజూలైలో 4.5 లక్షల హీరో మోటోకార్ప్‌ మోటర్‌ సైకిళ్లు, స్కూటర్ల అమ్మకాలు

జూలైలో 4.5 లక్షల హీరో మోటోకార్ప్‌ మోటర్‌ సైకిళ్లు, స్కూటర్ల అమ్మకాలు

- Advertisement -

న్యూదిల్లీ: ప్రపంచంలో అత్యధిక మోటర్‌ సైకిళ్లు, స్కూటర్ల తయారీదారు అయిన హీరో మోటోకార్ప్‌ జూలై 2025లో 449,755 యూనిట్లను పంపిణీ చేసింది. తద్వారా జూలై 2024లో నమోదైన 370,274 యూనిట్ల కంటే 21% పెరుగుదలను నమోదు చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మార్కెట్‌ ట్రెండ్‌లకు అనుగుణంగా జూలై 2025లో హీరో మోటోకార్ప్‌ 339,827 యూనిట్లకు పైగా వాహన్‌లి రిటైల్‌ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసింది. రిటైల్‌ కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పండుగ సీజన్‌ రాబోతుండటంతో, రాబోయే నెలల్లో ఈ అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా. ఈ నెలలో, కంపెనీ కీలక విభాగాలలో తన కార్యకలాపాలను విస్తృతం చేసుకుంది . స్కూటర్లలో, డెస్టినీ 125, జూమ్‌ 125 అమ్మకాల ద్వారా మార్కెట్‌ వాటా పరంగా మెరుగైన ఫలితాలు కనిపించాయి. మోటర్‌ సైకిల్‌ విభాగంలో, హీరో మోటోకార్ప్‌ తమ హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ ప్రోను విడుదల చేయటం ద్వారా హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు