గురుగ్రామ్: భారతదేశంలో న్యూ ఎనర్జీ మొబిలిటీని ముందుకు తీసుకెళ్లాలనే తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తూ, జేఎస్డబ్ల్యు ఎంజీ మోటర్ ఇండియా ఈరోజు ఎంజీ అడాప్ట్ (అడ్వాన్స్ డైవ్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫార్మ్ టెక్నాలజీ)ను ఆవిష్కరించింది. ఇది భారతదేశపు తొలి మల్టీన్యూ ఎనర్జీ వెహికల్ (ఎన్ఈవీ) ప్లాట్ఫార్మ్. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ మాడ్యులర్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు), హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (హెచ్ఈవీలు), ప్లగ్ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (జీహెచ్ఈవీలు), అలాగే రేంజ్ ఎక్స్టెండర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఆర్ఈఈవీలు)కు మద్దతు ఇస్తుంది. దీంతో ఒకే తెలివైన ప్లాట్ఫార్మ్పై అనేక శక్తి పరిష్కారాలను సమన్వయం చేస్తుంది. వినియోగదారుల మారుతున్న అవసరాలు మరియు వేగంగా రూపాంతరం చెందుతున్న మొబిలిటీ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎంజీ అడాప్ట్‌ను ఒక తెలివైన మాడ్యులర్ ఆర్కిటెక్చర్‌గా అభివృద్ధి చేశారు. ఈ ప్లాట్‌ఫారమ్ ఒకే ఫ్రేమ్‌వర్క్‌లో అనేక విద్యుదీకృత ప్రొపల్షన్ సాంకేతికతలను సజావుగా సమన్వయం చేస్తుంది. అధిక డిజైన్ సౌలభ్యంతో కూడిన దీని ఆధునిక ఇంజినీరింగ్ వేగవంతమైన ఉత్పత్తి అభివృద్ధిని అందించడంతో పాటు, డైవింగ్ పరిధి పెంపు, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యం, మెరుగైన సామర్థ్యం, మరింత శక్తివంతమైన పనితీరు, మెరుగైన భద్రత మరియు అత్యుత్తమ డైవింగ్ అనుభవాన్ని అందించడంపై దృష్టి సారిస్తుంది. భవిష్యత్ మొబిలిటీ సాంకేతికతలకు అనుగుణంగా మారగల సామర్థ్యాన్ని కొనసాగిస్తూ, ప్రతి డైవింగ్ అవసరానికి సరైన పవర్ట్రెయిన్‌ను వినియోగదారులకు అందించడమే ఎంజీ అడాప్ట్ లక్ష్యం.
జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ నుంచి ఎంజీ అడాప్ట్ ఆవిష్కరణ
- Advertisement -


