Homeటార్గెట్‌ డిసెంబర్‌`6

టార్గెట్‌ డిసెంబర్‌`6

- Advertisement -

. 32 కార్లతో దిల్లీలో పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం
. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకార కుట్ర
. అల్‌-ఫలాప్‌ా యూనివర్సిటీలోనే పథక రచన
. దిల్లీ పేలుడు కేసులో దిగ్భ్రాంతి కొల్పే వాస్తవాలు

న్యూదిల్లీ: దిల్లీ ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు కేసు, ఫరీదాబాద్‌లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు కనుగొన్న కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటన ఉగ్రవాద దాడిగా కేంద్రం ప్రకటించగా… నిందితులందరికి జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో బయటపడిరది. డాక్టర్లుగా ఉంటూ ఉగ్రవాదులుగా మారిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కారు బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తిని కశ్మీర్‌కు చెందిన ఉమర్‌ నబీగా గుర్తించారు. నిందితుందరికి ఫరీదాబాద్‌లోని అల్‌-ఫలాప్‌ా యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇక ఈ కేసులో పెద్ద కుట్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. డిసెంబర్‌ 6, బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజున ప్రతీకారం తీర్చుకునేందుకు దాడులకు పాల్పడాలని ఉగ్రవాదులు ప్రణాళిక రచించారు. దీని కోసం 32 కార్లను కూడా సిద్ధం చేసుకున్నారు. ఆరు దశల్లో ఒకేసారి బాంబు పేలుళ్లు జరపాలని ప్లాన్‌ చేశారు. ఇందుకోసం దిల్లీలోని ఆరు వేర్వేరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నాలుగు కార్లను గుర్తించారు. ఇవన్నీ పాత కార్లుగా తేలాయి. దాడులకు పాత కార్లను ఉగ్రవాదులు కొనుగోలు చేశారు. బ్రెజ్జా, స్విఫ్ట్‌, ఎకోస్పోర్ట్‌ కార్లను పోలీసులు గుర్తించారు. సోమవారం దాడి సమయంలో హ్యుందాయ్‌ ఐ20కారును ఉపయోగించారు. పోలీసులకు ట్రేస్‌ చేసినా దొరక్కుండా ఎక్కువ సార్లు చేతులు మారిన కార్లను ఉగ్ర డాక్టర్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ కారును పోలీసులు హర్యానా ఫరీదాబాద్‌లో గుర్తించారు. బ్రెజ్జా కారును మహిళా వైద్యురాలు షాహినా సయీద్‌ వాడినట్లు కనుగొన్నారు. ఈమెనే జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ మహిళా విభాగానికి ఇండియాలో హెడ్‌గా పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. బ్రెజ్జా కారును హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్‌-ఫలా స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ క్యాంపస్‌లో గుర్తించారు. ఈ కేసులో ఉగ్రవాద డాక్టర్లు- ఆదిల్‌ అహ్మద్‌ రాథర్‌, ముజమ్మిల్‌ షకీల్‌, సాహినా సయీద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
కారులో లభ్యమైన డీఎన్‌ఏ డా.ఉమర్‌ నబీదే…
దిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు కారణమైన కారులో లభించిన నమూనాలతో డాక్టర్‌ ఉమర్‌ నబీ డీఎన్‌ఏ మ్యాచ్‌ అయినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పేలుడుకు ముందు ఉమర్‌ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలను అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న ఉమర్‌ కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అధికారులు అనుమానించారు. ఈ క్రమంలోనే పుల్వామాలోని అతడి కుటుంబసభ్యుల నుంచి డీఎన్‌ఏ నమూనాలు తీసుకొని పరీక్షించారు. తాజాగా కారు నుంచి లభ్యమైన డీఎన్‌ఏ ఉమర్‌ నబీదేనని తేలినట్లు తెలుస్తోంది.
మరో డాక్టర్‌ అరెస్టు
దిల్లీ బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు క్రమంలో మరో కీలక అరెస్ట్‌ జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వైద్య విద్యార్థి(కార్డియాలజిస్ట్‌) డాక్టర్‌ మహ్మద్‌ ఆరిఫ్‌ (32)ను యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌(ఏటీఎస్‌) అదుపులోకి తీసుకుంది. జమ్మూకాశ్మీరులోని అనంత్‌ నాగ్‌ వాస్తవ్యుడైన ఆరిఫ్‌… మూడు నెలల క్రితమే కాన్పూర్‌లోని గణేశ్‌ శంకర్‌ విద్యార్థి మెమోరియల్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో కార్డియాలజీ మొదటి సంవత్సరం కోర్సులో చేరాడు. డాక్టర్‌ షాహీన్‌ ఈ కాలేజీలోనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న షాహీన్‌ దర్యాప్తు క్రమంలో ఆరిఫ్‌ పేరును వెల్లడిరచినట్లు సమాచారం. దీంతో ఆరిఫ్‌ను అరెస్టు చేసి, ప్రశ్నించేందుకు రహస్య ప్రదేశానికి తరలించారు.
రూం నంబర్‌ 13లో ప్లానింగ్‌
హర్యానాలోని అల్‌ ఫలా యూనివర్సిటీలో దర్యాప్తు అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అక్కడి మెడికల్‌ కాలేజీలోని బాయ్స్‌ హాస్టల్‌ ఉండే 17వ నంబరు భవనం ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే అరెస్టైన డాక్టర్‌ ముజమ్మిల్‌కు చెందిన 13వ నంబరు గదిలోనే ఉగ్రకుట్రలకు పథక రచన చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యూనివర్సిటీ ల్యాబ్‌ నుంచి కొన్ని రసాయనాలను ఉమర్‌, ముజమ్మిల్‌ సేకరించినట్లు తెలిసింది. ఈ గదిలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని కెమికల్స్‌, డిజిటల్‌ పరికరాలు, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అటు ముజమ్మిల్‌తో పాటు ఉమర్‌కు చెందిన 4వ నంబరు గదిలో సోదాలు చేసిన అధికారులు మూడు డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలను పరిశీలించిన దర్యాప్తు అధికారులు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు వీరు ప్రణాళికలు చేసినట్లు గుర్తించారు. 4 నగరాల్లో ఇద్దరు చొప్పున మొత్తం 8 మంది పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిపారు. ఈ ఎనిమిది మందిలో ఉమర్‌, ముజమ్మిల్‌తో పాటు డాక్టర్‌ అదిల్‌, డాక్టర్‌ షాహీన్‌ కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ కుట్రను అమలుచేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్‌కు అప్పగించినట్లు సమాచారం. ఇందుకోసం నిందితులు దాదాపు 26 లక్షల వరకు నిధులు సేకరించి ఆ మొత్తాన్ని ఉమర్‌కు ఇవ్వగా… రూ.3 లక్షల విలువైన 20 క్వింటాళ్లకుపైగా ఎన్‌పీకే ఫెర్టిలైజర్‌ను గురుగ్రామ్‌, నూప్‌ా తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించాయి. ఈ పదార్థాలను వినియోగించి వారు ఐఈడీ బాంబులను తయారుచేయాలని ప్లాన్‌ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, వీరి కుట్రలను పోలీసులు భగ్నం చేశారని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు