Homeతెలంగాణడిమాండ్‌కు అనుగుణంగావిద్యుత్ ఉత్పత్తి

డిమాండ్‌కు అనుగుణంగావిద్యుత్ ఉత్పత్తి

- Advertisement -

రోజుకు 140 మిలియన్ యూనిట్లకు పెంచేలా ప్రణాళిక
యాదాద్రి ప్లాంట్‌కు కోల్ ఇండియా నుంచి ప్రత్యామ్నాయ బొగ్గు
మూతపడిన పరిశ్రమల బకాయిల చెల్లింపునకు వన్టైమ్ సెటిల్మెంట్
సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి

విశాలాంధ్ర – హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినా, విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో విద్యుత్ కొరత తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాబోయే రబీ, వేసవి సీజన్లలో వ్యవసాయ, గృహ విద్యుత్ అవసరాలను సమర్థంగా తీర్చేందుకు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని రోజుకు 140 మిలియన్ యూనిట్లకు పెంచేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గురువారం విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, బకాయిల అంశాలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజువారీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సగటున 91 మిలియన్ యూనిట్లకు చేరిందని, ఇటీవల ఒక్కరోజులో 118 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నమోదైందని అధికారులు వివరించారు. ఈ స్థాయి నుంచి ఉత్పత్తిని మరింత పెంచి రోజుకు 140 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లకు బొగ్గు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కోల్ ఇండియా నుంచి ప్రత్యామ్నాయ బొగ్గు సరఫరా అనుసంధానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మార్గం ద్వారా బొగ్గు సరఫరా నవంబర్ నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి పెంపులో భాగంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. “ఈ కేంద్రంలోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఐదో యూనిట్‌ను ఈ నెల 20న గ్రిడ్‌కు అనుసం ధానించామని, మిగిలిన సాంకేతిక, నిర్వహణప రమైన సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరి ంచి, ఐదో యూనిట్‌ను పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాల్లోకి తీసుకువస్తున్నామని” అధికా రులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. “టీజీజె న్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల రోజు వారీ సగటు ఉత్పత్తి 2024-25లో 65.90 మిలి యన్ యూనిట్లు, 2025-26లో సుమారు 76.46 మిలియన్ యూనిట్లు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 21 నాటికి 90.97 మిలియన్ యూనిట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రోజుకు 14.51 మిలియన్ యూనిట్ల మేర, సుమారు 19 శాతం పెరుగుదల నమోదైంది. ఈ నెల 16న ఒక్కరోజులో 118 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి” జరిగిందని అధికారులు తెలిపారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని అన్ని యూనిట్లు గరిష్ఠ సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను పెంచాలని, ఉత్పత్తిని రోజువారీ సమీక్షిస్తూ లక్ష్య సాధన దిశగా నిరం తర పర్యవేక్షణ చేపట్టాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమ లకు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిల చెల్లింపుల విషయంలో వన్టైమ్ సెటిల్మెంట్ విధానం ద్వారా బకాయిల చెల్లింపును సులభత రం చేసి, వినియోగదారులకు ప్రయోజనం కలిగించేలా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మూతపడిన పరిశ్రమల యాజమాన్యాలతో సమన్వయం చేసుకొని, విద్యుత్ బకాయిల పరిష్కారానికి అందుబాటులో ఉన్న అవకాశాలు, నిబంధనలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా దానికి అనుగుణంగా ఉత్పత్తి, ప్రసారం, సరఫరా వ్యవస్థలను సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిత్తల్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, జెన్కో సీఎండీ హరీశ్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఆర్‌పీడీసీ¾ఎల్ సీఎండీ ముషారఫ్, సింగరేణి డైరెక్టర్ గౌతం పోట్రు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు