వాషింగ్టన్ : అమెరికా`చైనా మధ్య సుంకాల యుద్ధం తీవ్రతరమవుతూ వాణిజ్య యుద్ధానికి దారితీస్తున్న పరిస్థితుల్లో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనాతో మరో మూడు లేక నాలుగు వారాల్లో వాణిజ్య ఒప్పందం ఖరారు కాబోతోందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ‘వచ్చే మూడు లేక నాలుగు వారాల్లో చైనాతో వాణిజ్య ఒప్పందం జరుగుతుంది. ఇదంతా త్వరలోనే పూర్తవుతుంది’ అని శ్వేతసౌధం వద్ద విలేకరులతో మాట్లాడిన ట్రంప్ అన్నారు. చైనాతో చాలా మంచి వాణిజ్య ఒప్పందం జరగబోతోందని వెల్లడిరచింది. అమెరికా ప్రతీకార సుంకాలపై అనేక ఆసియా దేశాలు ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టాయి. కొన్ని దేశాలకు మినహాయింపులు ఇచ్చేందుకు అమెరికా ఒప్పుకుంది. కొంత కాలం విరామాన్ని కూడా ప్రకటించింది. అయితే చైనాకు ఎలాంటి ఊరటనివ్వకపోగా ఆ దేశ ఉత్పత్తులపై ఏకంగా 245 సుంకాన్ని ప్రకటించింది. ఈ పరిణామాల క్రమంలో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోనున్నట్లు ట్రంప్ చెప్పడం చర్చకు దారితీసింది.
యుద్ధం ఆపకపోతే సాయం ఆపేస్తాం… ఉక్రెయిన్‌కు హెచ్చరిక
యుద్ధం ముగించకపోతే ఇక మీ దేశాన్ని పట్టించుకోమని ఉక్రెయిన్‌ను అమెరికా హెచ్చరించింది. పశ్చిమాసియాకు ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌తో కలిసి యూరప్, ఉక్రెయిన్ నాయకులతో భేటీ అయిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇది మా యుద్ధం కాదు. మూడేళ్ల నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేస్తోంది. ఇకపై సాయాన్ని ఆపేయాలని భావిస్తున్నాం. యుద్ధం ఆపలేని పరిస్థితుల్లో ఉక్రెయిన్ గురించి పట్టించుకోవడం మానేసి అమెరికా తన దారిని తాను చూసుకుంటుంది’ అని రుబియో వెల్లడిరచారు.
త్వరలో చైనాతో వాణిజ్య ఒప్పందం: ట్రంప్
RELATED ARTICLES